sai dharam tej is campaigning : పవన్ కళ్యాణ్ కోసం మెగా మేనల్లుడి
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ల ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).

Mega Nephew for Pawan Kalyan
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ల ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ ద్వారా తెలుగు సినీ సీమకి పరిచయం అయ్యాడు. వరుస హిట్లతో మామలకి తగ్గ అల్లుడు అని అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు పదహారు సినిమాలో నటించిన తేజ్ టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచాడు
తేజ్ తన మావయ్య పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రచార బాధ్యతలని తీసుకున్నాడు. మే నాలుగున మచిలీపట్నంలో, ఐదున పిఠాపురంలో, ఆరున కాకినాడ లో జనసేన అభ్యర్థుల గెలుపు కోరుతు ప్రచారం చెయ్యబోతున్నాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది.సదరు ఏరియాల్లో భారీ ఎత్తున రోడ్ షో లు కూడా నిర్వహించబోతున్నాడు. ఏపి లో పొలిటికల్ హీట్ పెరిగిన నేపధ్యంలో తేజ్ వార్త మరింత పొలిటికల్ హీట్ ని పెంచింది
ఇక కెరీర్ విషయానికి వస్తే వరుస ప్లాప్ ల తర్వాత విరూపాక్ష తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్రో కూడా మంచి విజయాన్నే సాధించింది. బ్రో లో తమ మామ పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ కి రచ్చ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంపత్ నంది ఆ మూవీకి దర్శకుడు