Mega Power: చీదరింపుల నుంచి శిఖరం పైకి.. ప్రపంచ సినిమాను శాసిస్తున్న చెర్రీ.. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. సారీ అతనిప్పుడు గ్లోబల్‌ స్టార్‌. అడుగు పెట్టింది చిరంజీవి కొడుకుగానే అయినా.. అతను వచ్చిన తరువాత సీన్‌ మారిపోయింది. చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ అనే స్థాయి నుంచి రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే రేంజ్‌కు వెళ్లిపోయాడు రామ్‌ చరణ్‌. నిజానికి రామ్‌ చరణ్‌ అవమానాలతోనే కెరీర్‌ను ప్రారంభించాడు. అందంగా లేడంటూ ఇన్సల్ట్‌ చేశారు. యాక్టింగ్‌ రాదంటూ జడ్జ్‌ చేశారు. అసలు మెగాస్టార్‌ ఫీచర్స్‌ ఒక్కటి కూడా లేవంటూ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసేలా మాట్లాడారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2023 | 09:00 PMLast Updated on: Mar 26, 2023 | 9:00 PM

Mega Power Star Birtyday Special

జంజీర్‌ సినిమా టైంలో.. బాలీవుడ్‌లో రామ్‌ చరణ్‌ ఫేస్‌ చేసిన కామెంట్స్‌ అన్నీ ఇన్నీ కాదు. ఏకంగా సినిమాలకే పనికిరాడంటూ డిసైడ్‌ చేసేశారు. బాలీవుడ్‌లో ఎవరైతే రాంచరణ్‌ను అవమానించారో.. చెర్రీ మావోడు అని వాళ్లతోనే చెప్పించాడు. రాళ్లు విసిరిన చేతులతోనే పూలు జల్లించుకున్నాడు. ఏ నోర్లు అతన్ని విమర్శించాయో ఇప్పుడు అవే నోర్లు గ్లోబల్‌స్టార్‌ జపం చేస్తున్నాయ్. ఎవరైతే యాక్టింగ్‌ రాదంటూ జడ్జ్‌ చేశారో.. ఇప్పుడు వాళ్లే చెర్రీతో ఫొటో దిగితే చాలనుకుంటున్నారు.

రంగస్థలం సినిమాతో నటుడిగా రామ్‌చరణ్‌ మళ్లీ పుట్టాడు. ఆ సినిమా నుంచి చెర్రీ రేంజ్‌ మారిపోయింది. అప్పటిదాకా అంతా అతన్ని చిరంజీవి కొడుకుగానే చూశారు. రంగస్థలంతో తనలో ఉన్న ఒరిజినల్‌ స్టార్‌ను బయటికి తీసుకువచ్చాడు చరణ్‌. అప్పటి నుంచి కెరీర్‌లో.. చరణ్‌ వెనక్కి చూసుకోలేదు. సినిమా హిట్టా ఫ్లాపా అనేది సెకండ్‌ టాపిక్‌. చెర్రీ యాక్టింగ్‌కు మాత్రం 100కు 100కు మించి మార్కులు పడేవి. ఇదే చరణ్‌ను ఇంటర్నేషనల్‌ స్టార్‌ను చేసింది. ఆస్కార్‌ వేదిక మీద గౌరవం తీసుకువచ్చింది. చరణ్‌ అంటే తెలియని.. సినిమా అభిమాని ఇప్పుడు ప్రపంచంలో లేడు. ఇదీ ఇప్పుడు రాంచరణ్‌ రేంజ్‌.

ట్రిపులార్‌లో చరణ్‌ పర్ఫార్మెన్స్‌కు అవార్డులు కొలమానం కాదు. అమెరికా క్రిటిక్స్ అవార్డు అయినా.. ఇంకేదైనా అది చెర్రీ నటనకు లెక్క కాదు. జస్ట్‌ గుర్తింపు అంతే ! చెర్రీ లుక్స్‌కు ఫిదా కానీ అమ్మాయి ఉండదు. అతని అవుట్‌ఫిట్స్‌కు ఫ్యాన్‌ అవ్వని అబ్బాయి ఉండడు. సినిమాల్లోనే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా చెర్రీ వాడే కాస్ట్యూమ్స్‌ అద్భుతంగా ఉంటాయ్. ఇంత స్టార్‌డమ్‌ ఉన్నా, ఫ్యాన్‌ బేస్‌ఉన్నా.. తండ్రి మాట జవదాటని నేచర్‌ చెర్రీది. ఒకే స్టేజ్‌ మీద ఇద్దరూ నిలబడాల్సి వస్తే ఓ చిన్న పిల్లాడిలా, స్టూడెంట్‌లా ఉంటాడు చరణ్‌. ఈ క్రమశిక్షణే చరణ్‌కు ఇంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది.

తండ్రి మెగాస్టార్‌.. బాబాయ్ పవర్‌ స్టార్‌.. ఈ ఇద్దరి మధ్య మెగాపవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం.. దాన్ని నిలబెట్టుకోవడం మాములు విషయం కాదు. అది చేసి చూపించాడు చెర్రీ ! కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు చెర్రీ నటిస్తున్నాడు అంటే ఆ సినిమా.. ప్యాన్‌ వాల్డ్ మూవీ ! ఈ రేంజ్‌కు చేరిన చెర్రీ ప్రపంచ సినిమాలను శాసించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ చెర్రీ ఫ్యాన్స్‌ అతనికి బర్త్‌ డే విషెస్‌ చెప్తున్నారు. డయల్‌ న్యూస్‌ తరఫున కూడా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు హ్యాపీ బర్త్ డే.