Mega Power Star: మరో మేసేజ్‌తో శంకర్.. RC15 స్టోరీ ఇదేనా!?
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమా తీస్తే అందులో అదిరిపోయే గ్రాఫిక్సే కాదు.. అద్భుతమైన మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సమాజాన్ని మార్చేయాలనే జీల్ కనిపిస్తుంది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో.. సొసైటీకి ఉపయోగపడే ఎన్నో మెసేజ్‌లు ఇచ్చాడు శంకర్. ఇప్పుడు రామ్ చరణ్‌తో తీస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరో మెసేజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
గేమ్ చేంజర్ టైటిల్ గ్లింప్స్ కోసం ఓ వీడియో రెడీ చేయించాడు శంకర్. ఈ వీడియోగో ఎలక్షన్ బ్యాలెట్ లోగోపై చెస్‌లోని కింగ్ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ చేసే మూవ్.. మిగతా కాయిన్స్‌ను తలకిందులు చేస్తుంది. అంటే రాజకీయ నాయకులు సొసైటీలో ఎలాంటి కీరోల్ ప్లే చేస్తారో ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలంటే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్ సినిమాలో ఉంబడోతోదంటున్నారు క్రిటిక్స్. పైగా ఈ సినిమాలో చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
అంటే దాదాపు కథ మొత్తం ఎన్నికలు.. ఆ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు చేసే అన్యాయాల చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఓ వైపు ఎన్నికల ప్రాసెస్ చూస్తేనే.. ప్రజలను మోసం చేసేందుకు పొలిటీషియన్స్ వేసే ఎత్తుగడలను కంట్రోల్ చేసేలా హీరో రోల్ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతుదో తెలియనప్పటికీ.. ఈ ఇమాజినల్ స్టోరీ కూడా అద్భుతంగా ఉందంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. గేమ్ చేంజర్‌గా చెర్రీ యాక్షన్ చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.