Mega power star : మెగా పవర్ స్టార్ మాస్ క్రేజ్.. బన్నీ, విజయ్ దేవర్‌కొండల రికార్డు బ్రేక్..
మీడియాలో తిరుగులేని మాస్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ హీరోగా తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్న చెర్రీ.. సోషల్ మీడియాలోనూ మెగా పవర్ సత్తా చాటి చెప్పాడు. తన లుక్స్, స్టైలింగ్, యాటిట్యూడ్‌తో యూత్ ఐకాన్‌గా మారిన ఈ మెగా వారసుడు.. ఫాలోయింగ్ విషయంలో రేర్ రికార్డ్ అందుకున్నాడు.

Mega power star mass craze.. Bunny and Vijay Deverkonda's record break..
మీడియాలో తిరుగులేని మాస్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ హీరోగా తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్న చెర్రీ.. సోషల్ మీడియాలోనూ మెగా పవర్ సత్తా చాటి చెప్పాడు. తన లుక్స్, స్టైలింగ్, యాటిట్యూడ్‌తో యూత్ ఐకాన్‌గా మారిన ఈ మెగా వారసుడు.. ఫాలోయింగ్ విషయంలో రేర్ రికార్డ్ అందుకున్నాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను చాలా ఫాస్ట్‌గా చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకోండ పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
చిరుత సినిమాతో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఒక్కో సినిమాకు తనను తాను మార్చుకుంటూ.. ఒక్కో మెట్టు పైకెక్కుతూ మెగా పవర్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో చెర్రీ ఏ రేంజ్‌కు చేరుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.. ఆస్కార్ అవార్డుల్లో సైతం ప్రపంచ దిగ్గజ నటుల దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసుకుడు. హాలీవుడ్ లో అవతార్ డైరెక్టర్ తో కూడా శభాష్ అనిపించుకున్నాడీ చిరుత.. ఇప్పుడు ఇన్‌స్టాలో ఈ అరుదైన ఫీట్‌తో తన మాస్ ఫాలోయింగ్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించాడు.
20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్‌ను చేరుకున్న సౌత్ ఇండియన్ స్టార్‌గా ఇప్పుడు చెర్రీ మరో రికార్డు సృష్టించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ రికార్డ్ గతంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల పేరిట ఉంది. ఈ 20మిలియన్ మార్క్ ని రామ్ చరణ్ 1635 రోజుల్లో చేరుకున్నాడు. ఈ మార్క్‌ని అందుకోవడానికి అల్లు అర్జున్ కు 1925 రోజులు పట్టగా.. రౌడీహీరో విజయ్ దేవరకొండకి 2050 రోజులు పట్టింది. ఇక.. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. త్వరలోనే సోషల్ మీడియాలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్..