గ్లోబల్ స్టార్ కోసం క్యూలో ముగ్గురు… వాళ్ళు అయినా కాపడతారా…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా కెరియర్ ను గడుపుతున్నాడు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా కెరియర్ ను గడుపుతున్నాడు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత అతను చేసిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆచార్య సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ కంప్లీట్ అయిపోయిందని ఫ్యాన్స్ సంతోష పడేలోపే.. గేమ్ చేంజర్ సినిమా కూడా రాడ్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ 100% న్యాయం చేసిన సరే సినిమా కథలో బలం లేకపోవడంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అనే చెప్పాలి.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉంది. దాదాపు 30% షూటింగ్ కంప్లీట్ చేసేసారు. షూటింగ్ కూడా ఎక్కడా లేట్ చేయటం లేదు. కుదిరితే 2026 ఎండింగ్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకి కూడా ఇతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సుకుమార్ తో తన 17వ సినిమా మొదలు పెట్టెందుకు రెడీ అవుతున్నాడు. బుచ్చిబాబు సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50%.. రాంచరణ్ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
బుచ్చిబాబు సినిమాను త్వరగానే రిలీజ్ చేసేసి సుకుమార్ సినిమాను మాత్రం కాస్త లేట్ చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు టాక్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీ ఏ ఒక్కటి ఇతనికి సక్సెస్ ఇవ్వలేదు. దీనితో రామ్ చరణ్ కాస్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. ఇక రాంచరణ్ కోసం క్యూలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. చరణ్ ఐదేళ్ల తర్వాత డేట్ ఇచ్చిన పర్వాలేదు.. మేము వెయిట్ చేస్తామని కొంతమంది ఎదురుచూస్తున్నారు. అందులో ముగ్గురు దర్శకులు కాస్త ముందుగా ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ మేకర్ నిఖిల్ నగేష్.. చరణ్ ఇమేజ్ కి తగ్గ ఒక డిఫరెంట్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాడు. పౌరాణిక నేపథ్యంలో సాగే కథ అని వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ కు వినిపించాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కచ్చితంగా ఆయన వింటే మాత్రం అది ఓకే చేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక హాయ్ నాన్న సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శౌర్యువ్ తో మరో సినిమా చేసే ఛాన్స్ కనబడుతోంది. అతను కూడా రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కూడా రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు ప్రశాంత్ డైరెక్షన్ లో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేసే చాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆ స్టోరీ కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉందని టాక్.