Ramcharan : విదేశాల్లో రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

Mega Power Star Ram Charan Tej became a global star with RRR movie..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. దీంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2 నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చరణ్ ట్రైనింగ్ దేనికి అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో 16వ సినిమా చేయబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో చరణ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నట్టుగా టాక్ ఉంది. కబడ్డీ కాకపోయిన ఆర్సీ 16 మాత్రం పక్కా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరి క్రీడాకారుడి పాత్రలో కనిపించడం అంటే.. చరణ్ కాస్త గట్టిగా కసరత్తులు చేయాల్సిందే. ఇందుకోసం రామ్ చరణ్ కండలు పెంచబోతున్నాడట. ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లనున్నట్టుగా సమాచారం. అక్కడ దాదాపు రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటాడని తెలుస్తోంది.
అందుకే.. ఈ సినిమా షూటింగ్‌ను ఆగష్టులో స్టార్ట్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ షూటింగ్ అయిపోయిన వెంటనే.. చరణ్ ఆస్ట్రేలియా ప్రయాణమవుతారని తెలిసింది. ఇప్పటికే బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. చరణ్ మేకోవర్ కంప్లీట్ అవగానే.. రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. చరణ్ డేట్స్ కూడా ఇచ్చేసినట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఆర్సీ 16 ఎలా ఉంటుందో చూడాలి.