Mega Power Star: పేరెంట్‌హుడ్ మూడ్‌లో ఉపాసన, చెర్రీ.. దుబాయ్‌లో గ్రాండ్‌గా సీమంతం
మెగా కోడలు ఉపాసన సీమంతం చాలా గ్రాండ్‌గా జరిగింది. దుబాయ్‌లోని నమ్మోస్ బీచ్‌క్లబ్‌లో ఉపాసన బేబీ షవర్ సెర్మోనీ నిర్వహించారు ఆమె కజిన్స్. ఈ మూమెంట్స్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది ఉపాసన.

Dubai Upasana Ram Charan Celebrations
ట్రిపులార్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపిన ఉపాసన, చరణ్ కపుల్ దుబాయ్‌కు వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ తన కజిన్స్‌తో కలిసి ఉపాసన చాలా ఎంజాయ్ చేశారు. ఈ వెకేషన్‌లోనే ఆమె కజిన్స్ ఆమెకు సీమంతం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఉపాసన, చరణ్ కజిన్స్‌తో పాటు చాలా తక్కువ మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్లైన దాదాపు పదేళ్ల తరువాత చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయంలో పెళ్లైన కొత్తలో చరణ్ దంపతులు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రీసెంట్‌గా ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది ఉపాసన.
పిల్లల్ని లేట్‌గా కనాలని పెళ్లైన కొత్తలోనే తాను చరణ్ డిసైడ్ అయినట్టు చెప్పింది ఉపాసన. ఈ విషయంలో వచ్చిన ట్రోలింగ్స్‌ను తానెప్పుడు పట్టించుకోలేదని చెప్పింది. ఇప్పుడు తాను తల్లి కాబోవడం, ట్రిపులార్ హిట్‌తో చరణ్‌కు వరల్డ్‌వైడ్ క్రేజ్ రావడం ఇవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయని చెప్పింది. వారసుడి కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబానికి, అభిమానులకు ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పింది ఉసాసన. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెన్‌లో వైరల్‌గా మారాయి. చెర్రీ, ఉపాసన పెయిర్‌ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వెయింటింగ్ ఫర్ లిటిల్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram