Mega Power Star: RC16 ఆయన ఆత్మకథేనా..?
ట్రిపులార్ సినిమా తరువాత రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన చేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయినా.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతోంది. చెర్రీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్‌డేట్, గాసిప్స్ వచ్చినా నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోతోంది.
ఇప్పుడు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండానే ఆర్సీ16 సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌తో వస్తున్న ఈ సినిమాను.. ఫర్‌గాటెన్ బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి నాయుడు లైఫ్ హిస్టరీ ఆధారంగా తీస్తున్నారట.
విశాఖ జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇండియాకు స్వతంత్రం రాకముందే చనిపోయిన ఈ అన్‌సంగ్ హీరో.. ఇండియాలోనే ఫేమస్ బాడీ బిల్డర్. ఎలాంటి సపోర్ట్ లేకుండా రైలు ఇంజన్‌ను ఆపిన రికార్డ్ ఆయన సొంతం. చెస్ట్ మీద ఏనుగును నిలబెట్టుకునేవాడు, మీసాలతో వెహికిల్స్‌ను లాగేవాడు. కుస్తీ పోటీల్లో, మల్ల యుద్ధాల్లో అప్పట్లో ఆయనను బీట్ చేసేవాళ్లు లేరు.
అప్పట్లో కింగ్ జార్జ్ ఫైవ్ నుంచి ఇండియన్ హెర్యులస్ అనే బిరుదును కూడా ఆయన పొందారు. అయితే పూర్తిగా రామ్మూర్తి నాయుడు బయోపిక్‌లా కాకుండా ఆయన జీవితంలోని ఇంపార్టెంట్ లైన్స్ మాత్రమే లీడ్‌గా తీసుకుని బుచ్చిబాబు కథ సిద్ధం చేశారని టాక్. అంతే కాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేయబోతున్నాడట. దీని గురించి అధికారికంగా అప్‌డేట్ లేదు.. కానీ చాలా దగ్గరి సోర్స్ నుంచి ఈ లీక్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా.. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్ చేంజర్‌కు గుమ్మడికాయ కొడితే తప్ప బుచ్చిబాబు సినిమా నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చేలా లేదు.