Mega Powerstar: గ్రాండ్‌గా రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. RC15 సెట్‌లో చెర్రీతో కేక్‌ చేయించారు మూవీ యూనిట్‌. సెలబ్రేషన్స్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ చెర్రీపై పూల వర్షం కురిపించారు. దిల్‌ రాజు, డైరెక్టర్‌ శంకర్‌, కైరా అద్వానీ, ప్రభుదేవా చెర్రీకి కేక్‌ తినిపించి బర్త్‌డే విషెస్‌ చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2023 | 01:30 PMLast Updated on: Mar 26, 2023 | 1:30 PM

Mega Powerstar Birthday Celebrations

సాధారణంగా చెర్రీ బర్త్‌ డే అంటేనే సెలబ్రేషన్స్‌ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. కానీ ఈ బర్త్‌ డే మాత్రం చరణ్‌కు మరింత ప్రత్యేకం కానుంది. చిరంజీవి కొడుకుగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ చెరణ్‌ కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ట్రిపులార్‌ సినిమాతో ఆస్కార్‌ వరకూ వెళ్లాడు. హాలీవుడ్‌లో సినిమా కూడా చేయబోతున్నాడు. ఇప్పుడు చెర్రీ నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ఇక పాన్‌ వరల్డ్‌ మూవీనే.

అంతే కాదు. చెర్రీ ఈ సంవత్సరం తండ్రి కూడా కాబోతున్నాడు. చరణ్‌కు పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు లేరు. దీనిపై రకరకాల కామెంట్స్‌ వచ్చినా చెర్రీ, ఉపాసన మాత్రం ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. తమ కెరియర్ల మీద ఫోకస్‌ చేశారు. చాలా కాలం తరువాత బుల్లి గ్లోబల్‌స్టార్‌ రాబోతున్నాడంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. దీంతో మెగా అభిమానులు ఆనందంలో తేలిపోయారు. చెర్రీ భార్య ఉపాసన కూడా జాతీయ స్థాయిలో బిజినెస్‌ ఉమెన్స్‌ లిస్ట్‌లో నిలిచి అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. ఇలా వరుస విజయాలతో వెళ్తున్న రామ్‌ చరణ్‌కు ఇది నిజంగా చాలా స్పెషల్‌ బర్త్‌డే అంటున్నారు ఫ్యాన్స్‌.

ఇప్పటికే కామన్‌ డీపీని కూడా వైరల్‌ చేశారు. ట్రిపులార్‌ సినిమాలో సీతారామరాజు గెటప్‌లో ఉన్న ఫొటోను కామన్‌ డీపీగా పెడుతున్నారు. ఇన్ని గుడ్‌ మూమెంట్స్‌ మధ్య జరుపుకుంటున్న ఈ బర్త్‌డేకు.. కొత్త ప్రాజెక్ట్స్‌ గురించి ఎలాంటి అప్‌డేట్స్‌ ఇస్తారా అని ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.