Pawan Kalyan – Ram Charan : పిక్ ఆఫ్ ది డే.. రెండు కళ్లు సరిపోవడం లేదు.. ఇది కాదా కావాల్సి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ ఇద్దరూ వరుణ్ పెళ్లిలో సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా కనిపించారు. ఓ వైపు పెళ్లి వేడుకలు కలర్ ఫుల్ గా సాగుతుంటే.. మరోవైపు పవన్ చరణ్ లు సింపుల్ లుక్ లో సందడి చేశారు. వపన్ కల్యాణ్ టీ షార్ట్ పై నల్లని కోట్ ధరించగా.. చరణ్.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా క్యాజువల్ గా కనిపించారు.

Mega Prince Varun Tej Lavanyas wedding Pawan Kalyan - Ram Charan both looked funny talking and having fun at Varun's wedding
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది. మూడ్రోజులుగా పెళ్లిలో మెగా హీరోల సందడి నెక్ట్స్ లెవల్ ఉందని ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. పెళ్లిలో సంప్రదాయ డ్రెస్ లో మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫోటోలో కనిపించి కనువిందు చేశారు. మెగా బ్రదర్స్, వారి కొడుకులు. అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలను చూసి.. పిక్ ఆఫ్ ది అంటూ మెగా అభిమానులు తెగ షేర్ చేసుకున్నారు. కట్ చేస్తే.. అంతకుమించి ఓ ఫోటో బయటకు రావడంతో.. ఇది కదా అసలైన ఫోటో అంటూ ఖుషి అవుతున్నారు..
వరుణ్ పెళ్లి ( Varun’s wedding ) తర్వాత.. ఒక్కొక్క ఫోటోలు బయటకు వస్తున్నాయి. పెళ్లిలో మెగా బ్రదర్స్.. వాళ్ల భార్యలతో కలిసి దిగిన ఫోటోలు సందడి చేశాయి. అలాగే.. వరుణ్ లావణ్య ఫోటోలు క్యూట్ గా అనిపించాయి. ఇక నిహారిక, శ్రీజ, నితిన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. అల్లు అర్జున్ కూడా సతీసమేతంగా ఫోటోలను ఫోజులిచ్చాడు. ఇక పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్యాజువల్ లుక్ లో కనిపించి అభిమానుల థిల్ ను ఖుషి చేశారు.
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) – రామ్ చరణ్ ( Ram Charan ) ఇద్దరూ వరుణ్ పెళ్లిలో సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా కనిపించారు. ఓ వైపు పెళ్లి వేడుకలు కలర్ ఫుల్ గా సాగుతుంటే.. మరోవైపు పవన్ చరణ్ లు సింపుల్ లుక్ లో సందడి చేశారు. వపన్ కల్యాణ్ టీ షార్ట్ పై నల్లని కోట్ ధరించగా.. చరణ్.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా క్యాజువల్ గా కనిపించారు. కోట్లు ఖర్చు పెట్టి జరుగుతున్న పెళ్లిలో సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ అనే ఫార్ములాను విడిచిపెట్టలేదు బాబాయ్ అబ్బాయ్. పక్క పక్కన నిలబడి.. నవ్వుతూ కనిపించిన ఫోటో మెగా అభిమానులకు పవర్ ట్రీట్ గా కనిపించింది. దీంతో ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు.