Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోతున్న పౌర పురస్కారాల్లో చిరంజీవిని పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉందంటూ వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
Mega Star Chiranjeevi: టాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. తన నటనతోనే కాదు.. తన సేవా కార్యక్రమాలతో కూడా ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన. సినీ రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ బిరుదుతో ఆయన్ను సత్కరించింది. ఇక ఇప్పుడు చిరుకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Raviteja: మంచే జరిగింది.. రవితేజ భలే తప్పించుకున్నాడు..
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోతున్న పౌర పురస్కారాల్లో చిరంజీవిని పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉందంటూ వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు కొవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా చాలా మందిని ఆదుకుంది. వీటన్నింటినీ గుర్తించిన మోదీ ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్‌తో సత్కరించాలని నిర్ణయించిందట. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరున్నట్లు డిల్లీ నుంచి సమాచారం వచ్చిందట. అయితే.. దీనిపై అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. చిరు ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక అయోధ్యలో శుక్రవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకి ఇప్పటికే చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆయన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. మరో వైపు సినిమాల విషయానికి వస్తే చిరు ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ టైమ్‌లో చిరు అత్యున్నత అవార్డును అందుకోబోతున్నారన్న వార్త మెగా ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను నింపింది.