Mega Star: ఐకానిక్‌ సీన్స్‌ని కూడా వదలట్లేదు.. వీళ్ల కామెడీ తగలేయ్యా.

మెగాస్టార్‌ చిరంజీవి నెక్ట్స్‌ మూవీ భోళశంకర్‌ నుంచి క్రేజి లీక్‌ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ను పవర్‌స్టార్‌ చేసిన ఖుషి మూవీలోని ఐకానిక్‌ సీన్‌.. అదే అండి ఆ నడుము సీన్‌. ఇప్పుడు ఈ నడుము సీన్‌ని రీక్రియేట్‌ చేయబోతున్నరట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2023 | 04:15 PMLast Updated on: Apr 29, 2023 | 4:15 PM

Mega Star In Iconic Seens

ఈ సీన్‌ మెగాస్టార్‌కి, హీరోయిన్‌ తమన్నా మధ్య ఉంటుందనుకుంటే మీరు పోరపాటు పడినట్టే.. ఈ సీన్‌ హీరో చిరంజీవికి, ఫేమస్‌ టాలీవుడ్‌ యాంకర్‌ శ్రీముఖీ మధ్య జరిగే కామిడీ పార్ట్‌ అని సమాచారం. వాల్తేరు వీరయ్య సూపర్‌హిట్‌ తర్వాత వస్తున్నా ఈ మూవీ 2015 తమిళంలో రిలీజ్‌ అయిన వేదాళం సినిమాకి రిమేక్‌. డైరెక్టర్‌ మెహార్‌ రమేష్‌ ఈ మూవీని తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోకి చెల్లెలి క్యారెక్టర్‌ కీర్తిసురేష్‌, హీరోయిన్‌గా తమన్నా యాక్ట్‌ చేస్తుంది.

ఈ విషయం తెలిసాక డైరెక్టర్‌ మెహార్‌ రమేష్‌కి ఈ ఐడియా ఎందుకు వచ్చిందో అంటూ ఫ్యాన్స్‌లో కొందరు అభిప్రాయ పడుతుంటే.. మరికొందరు ఫన్నీవేలోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్‌ అంటున్నారు. 2015 మూవీకి రిమేక్‌ కాబట్టి ఇలాంటి సీన్స్‌ ఉండటం కామన్‌. ఇప్పుడున్న సీచ్యూవేషన్‌లో జనాలు కనెక్ట్‌ కావడానికి డైరెక్టర్‌ చేస్తున్న ప్రయత్నాలని అర్థం అవుతుంది. ఈ మూవీని ఆగష్ట్ 11న రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు మేకర్స్‌. చూడాలి ఈ సీన్‌ థియేటర్‌లో నవ్విస్తుందో లేక ఫ్యాన్స్‌ని డిస్సపాయింట్ చేస్తుందో.