మెగా స్టార్ + నందమూరి నటసింహం… ఇద్దరు కలిస్తే పూనకాలే…

మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం బాలయ్య కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే సెన్సేషనే... అది చాలా సార్లు జరుగుతుందనే లోపు, ఆగిపోయిన సినిమాలా ట్రాక్ మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 08:55 PMLast Updated on: Mar 17, 2025 | 8:55 PM

Mega Star Nandamuri Natasimham When These Two Meet It Becomes Poonakale

మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం బాలయ్య కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే సెన్సేషనే… అది చాలా సార్లు జరుగుతుందనే లోపు, ఆగిపోయిన సినిమాలా ట్రాక్ మారింది. మొన్నా మధ్య అన్ స్టాపబుల్ లో కూడా చిరు గెస్ట్ గా రాబోతున్నాడన్నారు. పవన్, చరణ్ వచ్చారు, ఇక మిగిలింది మెగా స్టారే అన్నారు. నిజానికి క్వశ్చన్ పేపర్ కూడా రెడీ అయ్యింది. కాని కొత్త సీజన్ లో బాలయ్య షోలో చిరు కనిపిస్తాడన్నారు. మళ్లీ కొత్త సీజన్ ఎప్పుడు మొదలౌతుందో, అప్పుడు చిరు అడుగులు ఆ షోటో పడతాయో లేదో, ఇప్పుడే చెప్పలేం. కాని ఫస్ట్ టైం చిరు, బాలయ్య మరోలా కలవబోతున్నారు. ఏదో ఫంక్షన్ లోనో, లేదంటే ఇంకేదో ఈవెంట్ లోనో మాత్రం కాదు.. పక్కగా ఒకే తెర మీద నటసింహాన్ని, మెగా స్టార్ని చూడబోతున్నాం. ఆ విషయంలో తెలుగు వాళ్లు కాకుండా, మరొకరు ధైర్యం చేశారు.. ఇంతకి వాల్లెవరు? ఏ సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు..? హావేలుక్

మెగా స్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ఇద్దరూ టాలీవుడ్ లివింగ్ లెజెండ్సే.. ఇండస్ట్రీకి రెండు పిల్లర్స్ లాంటి స్టార్స్.. ఇద్దరి ఫ్యాన్స్ కి కూడా మాటలు యుద్ధాలు చేసుకునేంత హీట్ సిచ్చువేషన్స్ కూడా వచ్చాయి. ఇలా ప్రొఫేషనల్ రైవలరీ ఉన్నా, ఎప్పుడూ స్నేహంగా కనిపించే ఈ ఇద్దరు, ఎన్నడూ సల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోలేదు.బాలయ్య రీసెంట్ గా స్టేజ్ మీద కత్తిలాంటి కథుంటే తీసుకురండి, ఇద్దరం కలిసి చేస్తామని చిరు ముందే అన్నాడు. కాని ఇద్దరు మాస్ హీరోల ఇమేజ్ కి తగ్గ కథ సిద్దం చేసేందుకు తెలుగు దర్శక రచయితలకు ఐడియా చిక్కలేదో, ధైర్యం రాలేదో, కాని ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరిగినట్టు కనిపించలేదు. కాని ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద వెలగటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది.

ఉగాదికి సాలిడ్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ఉంది. అది కూడా మన దర్శక నిర్మాతలనుంచి కాదు, కోలీవుడ్ నుంచి. సూపర్ స్టార్ రజినీకాంత్ తో నెల్సన్ దిలీప్ జైలర్ సీక్వెల్ జైలర్ 2 స్టార్ట్ చేశాడు. అందులోనే ఇటు బాలయ్య, అటు చిరు ఇద్దరూ పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించే ఛాన్స్ ఉందట.నిజానికి జైలర్ టైంలోనే బాలయ్యని సంప్రదించినా సాలిడ్ సీన్స్ సెట్ కాక, నటసింహం ఎంట్రీ కన్ఫామ్ కాలేదు. కాని రజినీ కాంతే ఇటు బాలయ్య, అటు చిరంజీవి ఇద్దరినీ కాల్ చేసి రిక్వెస్ట్ చేయటంతో , ఈ ఇద్దరుమొనగాళ్ల జైలర్ 2 లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

జైలర్2 తీస్తున్న నెల్సన్ అండ్ టీం, ఉగాదికి వెల్ కమ్ టు జైలర్ అంటూ నటసింహం బాలయ్య, మెగా స్టార్ చిరంజీవి ఇద్దరి మోషన్ పోస్టర్లు రిలీజ్ చేయబోతున్నారు. అవి అక్కడ రెడీ అయ్యాయి కాబట్టే, ఇక్కడ న్యూస్ లీకైంది.. ఏ బ్రేకులు లేకుండా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే….జైలర్ 2లొ రజినీ కాంత్ తో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లానే బాలయ్య,చిరు, కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నట్టౌతుంది. అమితాబ్ కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆల్ మోస్ట్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోని లెజెండ్స్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే అవ్వొచ్చు.