Mega Star: చిరంజీవికి డైరెక్టర్స్ కావలెను
మెగా కాంపౌండ్ నుంచి దర్శకులు ఒక్కొక్కరూ మెల్లగా జారుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేతిలో నలుగురు దర్శకులుంటే.. ప్రస్తుతం ఒక్కరే మిగిలారు. అయితే.. రీసెంట్‌గా మరో దర్శకుడు వచ్చి చేశారు. లేటుగా వచ్చిన డైరెక్టర్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి.
భోళా శంకర్ తర్వాత చిరంజీవి సినిమాపై క్లారిటీ రాకపోయినా.. నిన్నటి వరకు చేతినిండా దర్శకులున్నారు. ఎవరో ఒకరు కథతో మెప్పించి ఛాన్స్ కొట్టేస్తారనుకుంటే.. ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ధమాకా హిట్ తర్వాత దర్శకుడు త్రినాథరావు చిరంజీవికి కథ రాస్తున్నాడనుకుంటే.. నాగశౌర్యతో సినిమా కమిటయ్యాడు. చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ కూడా వర్కవుట్ కాలేదు. దర్శకుడు చెప్పిన కథ నచ్చకపోవడంతో.. ఎనౌన్స్‌మెంట్ చేసిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. నితిన్, రష్మికతో భీష్మ తీసిన వెంకీ.. మరోసారి ఇదే జంటను రిపీట్ చేస్తూ.. రీసెంట్‌గా సినిమా మొదలుపెట్టాడు.
చిరంజీవి చేతిలో నుంచి దర్శకులు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మెగాస్టార్‌కు సరిపోయే కథలు రాయలేకపోతున్నారా? ఏడాదిపాటు కథతోనే ట్రావెల్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనుకుంటున్నారోగానీ.. పూరీజగన్నాథ్ కూడా రామ్ కోసం కథ రాసుకునే పనిలో వున్నాడట. ప్రస్తుతానికి మెగా కాంపౌండ్‌లో బంగార్రాజు ఫేం కల్యాణ్ కృష్ణ ఒక్కటే వున్నాడు. ఇతనితోపాటు.. బింబిసార దర్శకుడు వశిష్ట చేరాడు. బింబిసార హిట్ తర్వాత సీక్వెల్ కథను రెడీ చేయాలనుకున్నాడు దర్శకుడు. బింబిసారను మించిన కథ కుదరకపోవడంతో పక్కన పెట్టేశాడు . స్టార్స్‌కు కథలు రాయడం మొదలుపెట్టాడు. రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించాడని.. చిరంజీవి, బాలకృష్ణ కోసం కథలు రెడీ చేస్తున్నాడన్న వార్తలు బైటకొచ్చాయి. అయితే.. కొన్ని రోజులుగా చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి.. అంజి లాంటి సోషియో ఫాంటసి స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడని తెలిసింది.
బింబిసార చూసిన బాలయ్య.. వశిష్టను కథ రెడీ చేయమన్నాడు. రజనీకాంత్, బాలకృష్ణకు కథలు వినిపించి ఓకె చేయించుకున్నాడు. అయితే.. కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాతే చేద్దామంటే.. గ్యాప్ రాకుండా.. చిరంజీవితో సినిమా ఓకె చేయించుకున్నాడు. భోళా శంకర్ తర్వాత మరో సినిమాకు కమిట్ కాని మెగాస్టార్.. వశిష్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అయితే.. బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయితేగానీ.. సినిమా మొదలుపెట్టడు చిరంజీవి. భోళాశంకర్ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతోంది. ఈలెక్కన ఈ పాంటసీ మూవీ సెట్స్‌పైకి రావాలంటే.. ఇంకో ఆరేడు నెలలు పడుతుంది. చిరంజీవి కి తగిన డైరెక్టర్స్ లేక వెయిట్ చేయాల్సిందే