Chiranjeevi VS Pawan Kalyan : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా స్టార్‌, ప‌వ‌ర్ స్టార్ ఫైట్ త‌ప్ప‌దా..?

టాలీవుడ్‌ (Tollywood) లో సంక్రాంతి పోరుకు ఉండే క్రేజే వేరు.. సంక్రాంతి బ‌రిలో పెద్ద హీరోలు బాక్సాఫీస్ (box office) వ‌ద్ద ఢీ అంటే ఢీ అన‌డానికి ఆస‌క్తి చూపిస్తారు.. సంక్రాంతి పోరులో హిట్టు కొడితే ఆ కిక్కే వేర‌ప్పా అంటారు. ఇక సంక్రాంతి బరిలో బ‌డా హీరోల బాక్సాఫీస్ క్లాష్‌ని అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు ఇండ‌స్ట్రీ కూడా భ‌లే ఎంజాయ్ చేస్తుంటాది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 09:44 AMLast Updated on: Feb 15, 2024 | 9:44 AM

Mega Star Power Star Fight Near The Box Office

టాలీవుడ్‌ (Tollywood) లో సంక్రాంతి పోరుకు ఉండే క్రేజే వేరు.. సంక్రాంతి బ‌రిలో పెద్ద హీరోలు బాక్సాఫీస్ (box office) వ‌ద్ద ఢీ అంటే ఢీ అన‌డానికి ఆస‌క్తి చూపిస్తారు.. సంక్రాంతి పోరులో హిట్టు కొడితే ఆ కిక్కే వేర‌ప్పా అంటారు. ఇక సంక్రాంతి బరిలో బ‌డా హీరోల బాక్సాఫీస్ క్లాష్‌ని అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు ఇండ‌స్ట్రీ కూడా భ‌లే ఎంజాయ్ చేస్తుంటాది.. కాసుల గ‌ల‌గ‌ల‌తో ఇండ‌స్ట్రీ క‌ళ‌క‌ళ‌లాడుతుంటాది. మ‌రి.. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే జ‌న‌వ‌రికి సంబ‌ధించి ఒక లేటెస్ట్ బ‌జ్ వైర‌ల్‌గా మారింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఢీ కొట్ట‌బోతున్నారా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టాలీవుడ్‌లో మెగా హీరోల‌కు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప‌వ‌ర్ స్టార్ (Power Star) ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ ఏంటో వేరే చెప్ప‌క్క‌ర్లేదు.. ఈ మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) మూవీ చేస్తున్నారు. పవన్ మూడు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న ప‌వ‌న్.. ఎన్నికల అనంతరం వాటి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయనున్నారు. చిరంజీవి విశ్వంభర మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నారు. దీనిని 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

పవన్ నటిస్తున్న మూడు సినిమాల్లో పాన్‌ ఇండియా (Pan India) మూవీగా తెర‌కెక్కుతున్న ఓజి ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక క్రిష్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్నప్రెస్టీజియ‌స్ మూవీపై విప‌రీత‌మైన అంచ‌నాలున్నాయి.. వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ యాక్టింగ్ కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. అయితే.. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. . ఒకవేళ వీరమల్లు 2025 జనవరికి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్, పవర్ స్టార్ క్లాష్ తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.. మ‌రి ఈ విష‌యంలో హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) రిలీజ్ పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ అదే జ‌రిగితే మాత్రం ఫ‌స్ట్ టైమ్ మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య బాక్సాఫీస్ ఫైట్ త‌ప్ప‌ద‌న్న‌మాట‌..