మెగా స్టేట్ మెంట్ మిస్ ఫైర్… ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్..

మెగా స్టార్ అంటేనే ఇండస్ట్రీకి పెద్ద అంటారు. ఎలా చూసినా బాలయ్య, నాగ్, వెంకీ కంటే వయసులో, అనుభవంలో పెద్ద కాబట్టి మెగాస్టార్ మాట్లాడే ప్రతీ మాటకు చాలా వేయిట్ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 09:00 PMLast Updated on: Feb 11, 2025 | 9:00 PM

Mega Statement Misfire Unexpected Response From Ntr Fans

మెగా స్టార్ అంటేనే ఇండస్ట్రీకి పెద్ద అంటారు. ఎలా చూసినా బాలయ్య, నాగ్, వెంకీ కంటే వయసులో, అనుభవంలో పెద్ద కాబట్టి మెగాస్టార్ మాట్లాడే ప్రతీ మాటకు చాలా వేయిట్ ఉంటుంది.తను కూడా చాలా వరకు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడి, అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటాడు… అంతవరకు బానే ఉంది. విశ్వక్ సేన్ మూవీ లైలా ఈవెంట్ లో తను చెప్పిన మంచి మాట దగ్గరే సీన్ రివర్స్ అవుతోంది. తన చెప్పిన మంచి మాట, చెడుతూటాలా మారింది. తన స్టేట్ మెంట్ మిస్ ఫైర్ అవుతోంది. ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్స్ లేవు, అసలు ఇండస్ట్రీలో ఎవరి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవన్నాడు. ఆ ప్రాసెస్ లో అనుకోకుండా తను బాలయ్య, ఎన్టీఆర్ పేర్లు వాడటం అందరికి షాకింగ్ గా మారితే, ఆతర్వాత తన స్టేట్ మెంట్ మిస్ ఫైర్ అవటం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. ఇంతకి పాజిటివ్ మాట ఎందుకు నెగెటీవ్ తూటాలా మారింది? హావేలుక్
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ లైలా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. సినిమాను ప్రమోట్ చేశాడు. కాకపోతే,తను మంచి ఉద్ధేశ్యంతో అన్న మాటలే మిస్ ఫైర్ అయ్యాయన్న కామెంట్లే పెరిగాయి.

విశ్వక్ సేన్ ని ఉద్దేశిస్తు, తను బాలయ్య కాంపౌండ్ కి చెందిన వాడని, మాటి మాటికి తారక్ అంటుంటాడని,… సో తను మనవాడు కాదని ఎవరో చిరుతో అన్నారన్నాడు. దాన్నే చిరు ఖండించానని కూడా చెప్పాడు. ఎవరు ఎవరినైనా అభిమానించొచ్చు.. అంతమాత్రాన విశ్వక్ సేన్ సినిమాను ప్రమోట్ చేయటానికి తాను రావొద్దా అన్నాడు. తన సొంత కొడుకే తమిళ హీరో సూర్యని ఫ్యాన్ అని, అలాని చరణ్ మూవీలను తాను ప్రమోట్ చేయకూడాదా… ఇది అలాంటిదే అన్నాడు. ఈ మాటలన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి కూడా.. ఇప్పుడు అది కాదు సమస్య…

బాలయ్య ది వేరే కాంపౌడ్, చిరుది వేరే కాంపౌండ్ అనంటున్నారు. అలాంటివేం లేవు, తామంతా ఒకటే అన్నారు.. అక్కడ కూడా సమస్యలేదు. ఇంటికి తప్ప ఇండస్ట్రిక కాంపౌండ్స్ లేవన్న విశ్వక్ సేన్ మాటలు కూడా బాగున్నాయనే అంటున్నారు. కాకపోతే ఇక్కడ మిస్ ఫైర్ అయ్యిందేంటంటే, విశ్వక్ మనవాడు కాదు… బాలయ్య కాంపౌండ్ కి చెందినవాడు… అలానే మాట మాటికి తారక్ తారక్ అంటుంటాడని… చిరుతో ఒకరు చెప్పాడన్నాడు.. ఇంతకి ఇలా చిరుని మిస్ గైడ్ చేసిన వాళ్లెవరు

ఎక్కడో దూరంగా ఉండేవాల్లు ఇలాంటి సలాహాలు ఇవ్వరు.. అలాంటి సలహాలు ఇచ్చేవాళ్లు పక్కనే ఉన్నారంటే, అలాంటి వాళ్ల వళ్ల నిజంగానే ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉన్నాయనే అభిప్రాయం వస్తుంది. సో పరోక్షంగా బాలయ్య, చిరు వేరు వేరు, వాళ్లని ఇష్టపడేవాళ్లని బట్ట తమవాడు, వేరే వాడు అనే అబిప్రాయాలతో సినీ జనం ఉంటారని పరోక్షంగా కన్ఫామ్ చేసినైట్టైందంటున్నారు. ఆ వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ లో మెగాస్టార చిరు మాటల్లోనే తన నైజం ఏంటో అర్ధమౌతోందన్న నెటీజన్ రెస్పాన్స్ వైరలైంది. మొత్తంగా మంచి మాట చెప్పబోతే, పెడర్ధాలు పెరిగినట్టు, మెగాస్టార్ అనవసరంగా బాలయ్య, ఎన్టీఆర్ ప్రస్థావన తెచ్చి, ఉన్న అభిప్రాయాన్ని ముద్దరేసి కన్ఫామ్ చేశాడంటున్నారు.