మెగా తాండవం, ఫ్యాన్స్ కు పూనకాలు ఇస్తున్న వంగా ప్రాజెక్ట్

మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓ వైపు గేమ్ చేంజర్ మరో వైపు విశ్వంభర ప్రాజెక్ట్స్ ఊపెస్తుంటే.. చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ ను షేక్ చేసేస్తున్నాయి. దాదాపు ఏడు పదులో వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఫోకస్ చేయడం... పాన్ ఇండియా లెవెల్ లో భారీ హీట్ లు కొట్టాలి అని పట్టుదలగా ఉండటం చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 06:59 PMLast Updated on: Dec 04, 2024 | 6:59 PM

Mega Tandavam Vanga Project Giving Fans A Treat

మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓ వైపు గేమ్ చేంజర్ మరో వైపు విశ్వంభర ప్రాజెక్ట్స్ ఊపెస్తుంటే.. చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ ను షేక్ చేసేస్తున్నాయి. దాదాపు ఏడు పదులో వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఫోకస్ చేయడం… పాన్ ఇండియా లెవెల్ లో భారీ హీట్ లు కొట్టాలి అని పట్టుదలగా ఉండటం చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటికే విశ్వంభరా సినిమాతో సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న చిరంజీవి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ అనౌన్స్మెంట్ టాలీవుడ్ ను షేర్ చేస్తోంది.

మెగా అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు చిరంజీవి. దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. దీనికి నాని నిర్మాతక వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా స్టార్ట్ అయింది. సంక్రాంతికి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత లేదంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ టైంలో మరో న్యూస్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే చిరంజీవి విన్నారట. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనపడుతున్నట్టుగా టాక్. ప్రస్తుతం సందీప్ రెడ్డి… స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై క్లారిటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఇద్దరికీ సందీప్ రెడ్డి కథలు రెడీ చేసి పెట్టుకున్నాడు.

అయితే ప్రస్తుతం స్పిరిట్ సినిమాపై వర్క్ చేస్తున్న సందీప్ రెడ్డి ఆ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి మెగాస్టార్ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాకు సంబంధించి ఓ బాలీవుడ్ సంస్థ కూడా ఆసక్తి చూపడంతో ఇద్దరు సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇప్పటికే బయటకు వచ్చిన అప్డేట్స మెగా ఫ్యాన్స్ ను ఊపెస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేసారు చిరంజీవి.