మెగా Vs అల్లు.. పవన్ అభిమానులపై బన్నీ ఫ్యాన్స్ దాడి.. ఇంకా ఎంత దూరం పోతుందో..?

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెగా అల్లు కుటుంబాల మధ్య ఒకప్పటి రిలేషన్ ఎప్పుడు కనిపించడం లేదు అనేది కాదనలేని వాస్తవం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 04:50 PMLast Updated on: Apr 09, 2025 | 4:50 PM

Mega Vs Allu Bunny Fans Attack Pawan Fans How Far Will It Go

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెగా అల్లు కుటుంబాల మధ్య ఒకప్పటి రిలేషన్ ఎప్పుడు కనిపించడం లేదు అనేది కాదనలేని వాస్తవం. వాళ్లు లోపల కలిసే ఉంటున్నామని చెప్పిన కూడా బయటికి మాత్రం అలా కనిపించడం లేదు. ఒకప్పుడు రెండు కుటుంబాలు కలిసి హాయిగా పార్టీలు పండగలు చేసుకునేవి కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం అస్సలు కనిపించడం లేదు. అంతేకాదు ఇరు కుటుంబాల్లో ఎవరి పుట్టినరోజు వచ్చిన కూడా వేడుకలు ఘనంగా జరిగేవి. వాటికి సంబంధించిన సాక్షాలు నెక్స్ట్ డే సోషల్ మీడియాలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దానికి తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సాక్ష్యం. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే. ప్రతిసారి ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు మెగా కుటుంబం నుంచి కూడా విషెస్ వచ్చేవి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కచ్చితంగా చిరంజీవి అయితే అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాడు. అలాగే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్డే విషెస్ చెప్పేవాళ్లు. కానీ ఈ సంవత్సరం అలాంటి విషెస్ ఒక్కరి నుంచి కూడా కనబడలేదు. జూనియర్ ఎన్టీఆర్ గుర్తు పెట్టుకోండి మరి అల్లు అర్జున్ ను విష్ చేశాడు కానీ మెగా ఫ్యామిలీలో ఒక హీరో కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదు.

దీన్నిబట్టి కచ్చితంగా అల్లు అర్జున్, మెగా హీరోలకు మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడింది అని అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి అల్లు అరవింద్ అప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నాడు కానీ అల్లు అర్జున్ మాత్రం ఏదైతే అది అవుతుంది అంటూ ముందుకు వెళ్తున్నాడు. తనకు ప్రత్యేకంగా ఆర్మీ ఉంది అని.. మెగా అభిమానుల ఆత్మాభిమానంపై మళ్లీ మళ్లీ కొడుతూనే ఉన్నాడు బన్నీ. ఇదే వాళ్లకు ఆయనను మరింత దూరం చేస్తుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి. మొన్నటికి మన ఆర్య 2 సినిమా రి రిలీజ్ చేసినప్పుడు థియేటర్లో బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు జై పవన్ కళ్యాణ్ అన్నాడని బన్నీ అభిమానులు అతనిపై గొడవకు దిగారు.

చివరకు పవన్ కళ్యాణ్ అభిమానితో జై అల్లు అర్జున్ అనిపించే వరకు వదిలిపెట్టలేదు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అల వైకుంఠపురంలో సినిమాకు ముందు వరకు చిరంజీవి లేకపోతే నేనులేను.. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో అతిపెద్ద హీరో అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం పూర్తిగా తాను సొంతంగా వచ్చాను అనే స్థాయిలో మాట్లాడుకున్నాడు. ఇదే మెగా ఫాన్స్ కు బాగా కోపం తెప్పించే విషయం. ఇది మెల్ల మెల్లగా పాకి మెగా కుటుంబం వరకు వెళ్ళింది అని తెలుస్తుంది. అందుకే బన్నీ పుట్టినరోజున ఎవరు విష్ చేయలేదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే అలాంటిదేం లేదు సరిగ్గా అదే రోజు అకీరా నందన్ బర్త్ డే కూడా ఉంది. అతడిని కూడా ఎవరు విష్ చేయలేదు.. ఎందుకంటే సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు అగ్నిప్రమాదం జరగడంతో అందరూ ఆ టెన్షన్లో ఉన్నారు.. కాబట్టి ఎవరు ఈ పుట్టిన రోజు సంగతి గుర్తు పెట్టుకోలేదు అనేది మరో వర్గం చెబుతున్న మాట. ఏదేమైనా ఎంత కవర్ చేసుకున్నా.. అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య గ్యాప్ అయితే ఉంది అనేది కాదనలేని వాస్తవం. అది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం కూడా. ఎందుకంటే మొన్న మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు బన్నీ కూడా విష్ చేయలేదు.