మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్, పక్కా ప్లానింగ్ తో దిగుతున్నారా…?
ఎన్నడు లేని విధంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు ఇప్పుడు బయట పడ్డాయి. రాజకీయ నాయకులు కూడా వీటిపై వ్యాఖ్యలు చేయడంతో అసలు ఏం జరుగుతుందో జనాలకు అర్ధం కావడం లేదు. అల్లు అర్జున్… వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి సపోర్ట్ చేయడం దగ్గరి నుంచి పెద్దది అవుతూ వచ్చిన వివాదం ఇటీవల అల్లు అర్జున్ వ్యాఖ్యలతో చిరిగి చేట అయింది. ఇక మెగా ఫ్యామిలీపై విశ్వాసమో లేక అల్లు అర్జున్ పై కోపమో తెలియదు గాని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసారు.
ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా వివాదం పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరికపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూట్యూబ్ చానల్స్ కు సోషల్ మీడియాలో మీమ్స్ పేజెస్ కి కావాల్సినంత వినోదం దొరుకుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే… డిసెంబర్ లో పుష్ప 2 సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా వచ్చే గేమ్ ఛేంజర్ కూడా విడుదల కానుంది. ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ కామెంట్స్ చేసాడో తెలియదు గాని… తనను మెగా ఫ్యాన్స్ పుష్ప 2 సమయంలో ట్రోల్ చేసి సినిమాను ఇబ్బంది పెట్టవచ్చు అనే అంచనాకు వచ్చినట్టే కనపడింది.
మెగా ఫ్యాన్స్ ను సోషల్ మీడియాలో ఎదుర్కోవాలంటే దూకుడు కాదు వ్యూహం కావాలనే ప్లాన్ లో బన్నీ వెళ్ళాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ బన్నీని తొక్కాలని చూస్తుంది, కావాలని ట్రోల్ చేస్తుంది అనే సింపతీ క్రియేట్ చేసుకుంటే అది తన సినిమాకు ప్లస్ కావొచ్చు. ఇప్పుడు పోటా పోటీగా తిట్టుకుంటున్న మెగా, అల్లు ఫ్యాన్స్… ఈ రెండు సినిమాల విషయంలో పక్కాగా ప్లాన్ తో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ గనుక పుష్ప 2ను ట్రోల్ చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై వాట్సాప్ గ్రూప్స్ పెట్టి మరీ చర్చిస్తున్నారు అల్లు ఫ్యాన్స్.
మెగా ఫ్యామిలీని రోడ్ మీదకు లాగిన బన్నీని వదలవద్దని పుష్ప 2 ని ట్రోల్ చేయాల్సిందే అని, వాళ్ళు గనుక గేమ్ ఛేంజర్ ను ట్రోల్ చేస్తే మాత్రం బన్నీ పాత వీడియోలు అన్నీ తీసి ట్రోల్ చేద్దామని మెగా ఫ్యాన్స్ స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా వసూళ్ళపై ప్రభావం పడవద్దని బన్నీ, గేమ్ ఛేంజర్ వసూళ్ళపై దెబ్బ పడవద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ యుద్దానికి సిద్దమవుతున్నారు. మరి ఇది ఏ మలుపులు తిరుగుతుంది, ఈ వివాదం వ్యూహాత్మకమా లేక భయంతో మొదలైందా అనేది జనాలకు అర్ధం కావట్లేదు.