MEGASTAR CHIRANJEEVI: చిరు కొత్త సినిమాలు.. పాత సినిమాలకు కాపీలా..?
చిరు పాత హిట్ మూవీ ముగ్గురు మొనగాళ్లు కాన్సెప్ట్‌నే కొత్తగా రీ డిజైన్ చేసి.. ఒక్క చిరునే మూడు గెటప్స్‌లో ఉండేలా కథని రెడీ చేశాడట అనిల్ రావిపుడి. ఇప్పుడు చిరు చేస్తున్న విశ్వంబర కూడా ఇలాంటి ప్రయోగమే.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపుడి సినిమా అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆమధ్య తను కథ చెబితే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, మెగాస్టార్ రెమ్యునరేషన్ రూ.60 కోట్లు అనగానే దిల్ రాజు వెనకడుగు వేశారన్నారు. కానీ, ఫైనల్‌గా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ చిరు ఈ ప్రాజెక్ట్‌ని సైన్ చేశాడట. ఇక అనిల్ రావిపుడి నిజంగా చిరు సినిమాను హ్యాండిల్ చేయగలడా..?
GUNTUR KAARAM: ప్రి రిలీజ్ ఈవెంట్ల తలరాత మార్చేసిన పవన్ కళ్యాణ్
మొన్న బాలయ్య మూవీ భగవంత్ కేసరి, అంతకుముందు సరిలేరు నీకెవ్వరు అంటూ మహేశ్ సినిమాను హ్యాండిల్ చేశాడు అనిల్ రావిపుడి. ఆ కాన్ఫిడెన్స్‌తోనే చిరు.. తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే చిరు పాత హిట్ మూవీ ముగ్గురు మొనగాళ్లు కాన్సెప్ట్‌నే కొత్తగా రీ డిజైన్ చేసి.. ఒక్క చిరునే మూడు గెటప్స్‌లో ఉండేలా కథని రెడీ చేశాడట అనిల్ రావిపుడి. ఇప్పుడు చిరు చేస్తున్న విశ్వంబర కూడా ఇలాంటి ప్రయోగమే. ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి కాన్సెప్ట్‌నే రివర్స్‌లో వాడుతున్నాడు వశిష్ట అంటున్నారు. అక్కడ అతిలోకసుందరి భూమి మీదికొస్తే.. విశ్వంభరలో జగదేక వీరుడే ముల్లోకాల్లో అతిలోకసుందరి కోసం వెతుకుతాడట.
ఇలా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభరే మాత్రమే కాకుండా.. అనిల్ రావిపుడి డైరెక్షన్‌లో చేయబోయే సినిమా కూడా తన హిట్ సినిమాల మూల కథతోనే తెరకెక్కబోతోంది. అలా పాత కథలతోనే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ దొరుకుతోంది.