MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్‌తో మళ్లీ బాలయ్య ఢీ.. ఈసారి నాగ్, వెంకీ కూడా..

సంక్రాంతికి చిరు, బాలయ్య మధ్య పోటీ కొత్తగా ఎవరి అటెన్షన్ లాక్కోవట్లేదు. కానీ, చిరు స్నేహితులైన వెంకీ, నాగ్ కూడా మెగాస్టార్‌కి పోటీగా రావటమే వింతగా మారింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీతో అనిల్ రావిపుడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో వస్తోందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 05:36 PMLast Updated on: Feb 29, 2024 | 5:36 PM

Megastar Chiranjeevi And Balakrsihna Nagarjuna Movies Releasing Sankranthi

MEGASTAR CHIRANJEEVI: విశ్వంభర సంక్రాంతికి ప్లాన్ చేసిన మూవీ. కానీ, అప్పుడే రంగంలోకి దిగేంగుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. బోయపాటి శీను మేకింగ్‌లో ప్లాన్ చేసిన అఖండ సీక్వెల్ అప్పుడే రానుంది. నిజానికి వీళ్ల మధ్య పోటీ కొత్తేం కాదు. ఆ మధ్య ఖైదీనెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణ ఇలాగే పోటీపడ్డాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కూడా ఇలానే గత ఏడాది పోటీ పడ్డాయి. అందుకే వచ్చే సంక్రాంతికి చిరు, బాలయ్య మధ్య పోటీ కొత్తగా ఎవరి అటెన్షన్ లాక్కోవట్లేదు.

Hotel Shadab: జాగ్రత్త.. షాదాబ్‌ బిర్యానీ లొట్టలేసుకు తింటున్నారా.. మీ పని మటాష్‌..

కానీ, చిరు స్నేహితులైన వెంకీ, నాగ్ కూడా మెగాస్టార్‌కి పోటీగా రావటమే వింతగా మారింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీతో అనిల్ రావిపుడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో వస్తోందన్నారు. టైటిల్ ఏదైనా వచ్చే ముహుర్తం మాత్రం పొంగల్ అని తేలింది. మొన్నే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ.. ఇలా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడితే సంక్రాంతికి థియేటర్ల గొడవ జరిగింది. అలాంటిది వచ్చే సంక్రాంతికి ఐదుగురు పెద్ద హీరోలు పోటీ పడితే ఇక థియేటర్లు చింపిన విస్తరే. విశ్వంభర, అఖండ 2 సంక్రాంతికి వస్తుంటే, అదే సీజన్‌ని పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు టార్గెట్ చేసుకుంది.

వెంకీతో అనిల్ రావిపుడి తీసే సినిమాతోపాటు, నాగ్ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్న మూవీ కూడా సంక్రాంతికే రాబోతోంది. ఐదుగురు పెద్ద హీరోలకి థియేటర్లు సర్దుబాటు అవ్వటం కష్టం. ఇది వివాదానికి వెల్‌కమ్ చెప్పటమే. మరి అప్పటికి తగ్గితే పర్లేదు. కానీ, మొన్నటి సంక్రాంతిలాగే పరిస్థితి సేమ్ టూ సేమ్ ఉంటే మాత్రం కలెక్సన్స్‌లో కోత తప్పదు.