MEGASTAR CHIRANJEEVI: పాత హిట్ సినిమాల బాటలోనే చిరు అండ్ కో.. భలే ప్లాన్..!
ఇన్నాళ్లకి మళ్లీ విశ్వంభరతో అలాంటి సాహస వీరుడిగా మారారు చిరు. విశ్వంభరలో కత్తియుద్దాలు, విజువల్ ఎఫెక్స్ ఉన్నాయి. ఇవన్నీ మరో లోకానికి తీసుకెళ్లేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తుంటే, కాలంలో వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ కెరీర్‌లో రెండు మైల్‌స్టోన్ లాంటి మూవీలు జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి. నిజానికి జగదేక వీరుడు.. అతిలోక సుందరి.. నట సార్వభౌమ ఎన్టీఆర్ హిట్ మూవీ జగదేక వీరుడి కథ ప్రేరణతో వచ్చిందే. అలా జగదేక వీరుడిగా చిరు, అతిలోక సుందరిగా శ్రీదేవి అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. అలాంటి సోషియో ఫాంటసీ మూవీ మళ్లీ అంజి రూపంలో చిరుకి దక్కింది.
Janhvi Kapoor: బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ చెప్పిండు.. చెర్రీ తీసుకుండు..
బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం మరీ ఎక్కువ లేకున్నా, గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉందని ఈ మూవీని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకి మళ్లీ విశ్వంభరతో అలాంటి సాహస వీరుడిగా మారారు చిరు. విశ్వంభరలో కత్తియుద్దాలు, విజువల్ ఎఫెక్స్ ఉన్నాయి. ఇవన్నీ మరో లోకానికి తీసుకెళ్లేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తుంటే, కాలంలో వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. అదేంటో సడన్‌గా చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ అంతా తమ గత హిట్లను ప్రేరణగా తీసుకుని అదే జోనర్లో దూసుకెళ్లే ప్రయత్నం ఒకేసారి మొదలుపెట్టారు. బాలయ్య విషయానికొస్తే భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఈ రెండూ సినిమాలకు సీక్వెల్స్ లేదంటే, ఆ స్టోరీ లైన్‌తో కొత్త కథలని ప్లాన్ చేయిస్తున్నాడట. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరగుతున్నాయి.
హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడంటున్నారు. ఇక వెంకీ కూడా సాహసవీరుడు సాగర కన్య మూవీనే రీమేక్ లేదంటే సీక్వెల్ రూపంలో ప్లాన్ చేస్తున్నాడట. నాగ్ మాత్రం సోషియో ఫాంటసీ కథల వేటకి టీంని సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈమధ్య అన్నపూర్ణ స్టూడియోస్.. రైటర్లకు ఆహ్వానం పలకటం వెనక కారణం అదే అన్నట్టు తెలుస్తోంది.