Chiranjeevi: మెగా “జగదేక వీరుడి” సాహసం.. అదరగొట్టిన కొత్త పోస్టర్..

గాలి, నీరు, నిప్పు, నింగీ, నేల.. వీటితో తయారైన నక్షత్రమే మెగాస్టార్ అనే సెన్స్ వచ్చేలా చిరు 157వ సినిమా తాలూకు పోస్టర్ లాంచ్ చేసింది మూవీ టీం. ఆ పోస్టర్‌ని బట్టే తెలిసిపోతుంది.. ఇదో సోషియో ఫాంటసీ జోనర్ మూవీ అని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 05:08 PMLast Updated on: Aug 22, 2023 | 8:47 PM

Megastar Chiranjeevi Announces Epic Fantasy Mega 157 On His Birthday

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా పోస్టర్ పేలింది. ఒక నక్షత్రం, చుట్టూ పంచభూతాలు. గాలి, నీరు, నిప్పు, నింగీ, నేల.. వీటితో తయారైన నక్షత్రమే మెగాస్టార్ అనే సెన్స్ వచ్చేలా చిరు 157వ సినిమా తాలూకు పోస్టర్ లాంచ్ చేసింది మూవీ టీం. ఆ పోస్టర్‌ని బట్టే తెలిసిపోతుంది.. ఇదో సోషియో ఫాంటసీ జోనర్ మూవీ అని. అంతేకాదు జరుగుతున్న ప్రచారాలలో ఒకటి రాంగ్ అని తేలింది. ఈ సినిమా టైటిల్ ముళ్లోక వీరుడి కథ అన్నారు.

కాని మెగా జగదేకవీరుడు అంటూ టైటిల్‌ని కూడా ఫిల్మ్ టీం ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. సౌత్‌లో మెగా జగదేక వీరుడు, నార్త్‌లో మాత్ర జగదేక వీర టైటిల్‌ని ఫిల్మ్ టీం ఫిక్స్ చేసిందట. ఇది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ వల్లే లీకైంది. ఏదేమైనా జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యే మనలోకానికి వస్తుంది. కాని జగదేక వీరుడే ముళ్లోకాలు వెళ్లి తన దేవకన్య ప్రేమని దక్కించుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈమూవీ రాబోతోందట. అంటే ఇది పాత ఎన్టీఆర్ సినిమా జగదేక వీరుడు కథ రీమేకే అనుకోవాల్సి వస్తోంది. ఇక మెగాస్టార్ మరో మూవీ కళ్యాణ్ కృష్ణ మేకింగ్‌లో చేయాలనుకున్నాడు. దాన్ని చిరు కూతురు సుస్మిత నిర్మించబోతోంది. కాని అది మలయాళ మూవీ బ్రో డాడీ రీమేక్ అవటంతో, భోళా శంకర్ ఇచ్చిన పంచ్‌కి చిరు ఆలోచనలో పడ్డాడు.

బ్రో డాడీ రీమేక్ లో 90 శాతం కంటెంట్ మార్చటమే కాదు, రొమాంటిక్ సీన్లు కూడా తీసేయమనటంతో, దర్శకుడి కథని రీరైట్ చేస్తున్నాడు. సో అది రెడీ అవటానికి టైం పడుతుంది కాబట్టే ఆ ప్రాజెక్టు టెంపరరీగా ఆగిపోయిందట. నవంబర్‌లోగా కథ సిద్దం చేయాలనేది చిరు పెట్టిన కండీషన్ అని తెలుస్తోంది.