CHIRANJEEVI-PAWAN KALYAN: తమ్ముడి కోసం అన్నయ్య.. పవన్ ఆస్తులను చిరంజీవి కొంటున్నారా?

20 కోట్లకు ఇప్పటికే ఓ ఇంటి స్థలం అమ్మేశారు. మరో రెండు మూడు ప్రాపర్టీలను కూడా అమ్మేందుకు సిద్ధం అయ్యారు. ఐతే తమ్ముడికి సాయమో.. లేదంటే మరే కారణమో కానీ.. పవన్ అమ్మబోయే ఆస్తులను కొనేందుకు అన్నయ్య చిరంజీవి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 02:39 PMLast Updated on: Mar 07, 2024 | 2:39 PM

Megastar Chiranjeevi Buying Properties Of Pawan Kalyan Selling

CHIRANJEEVI-PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆస్తులు అమ్మే పనిలో ఉన్నారు. ఎన్నికల వేళ వంద కోట్లు సమీకరించాలని నిర్ణయం తీసుకున్న పవన్.. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో తన ఇంటి స్థలాన్ని రూ.20కోట్లకు అమ్మేశారు. డయల్‌న్యూస్‌ బయటపెట్టిన ఈ కథనం.. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. ఇదీ పవన్ అంటే.. పవర్‌ స్టార్‌ మంచితనం ఇదయ్యా అంటూ.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఒక వ్యక్తిగా ఆ ఖర్చు భరించడమే చాలా కష్టం.

GN Saibaba: పదేళ్ల చెర నుంచి సాయిబాబా విడుదల..

అలాంటిది ఓ పార్టీని నడిపించాలంటే.. ఖర్చు ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. పోలింగ్ పూర్తయి, ఫలితాలు వచ్చేవరకు చాలా డబ్బు సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇక ప్రచార సభలు, ప్రచార ఖర్చులు మరింత అదనం. ఐతే తన దగ్గర డబ్బు లేదని.. నిజాయితీగా జనాలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని పదేపదే చెప్పే పవన్.. ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే అని స్వయంగా చెప్పారు. ఐతే ఈ ఖర్చులను మొత్తం తన అభ్యర్థుల మీదే వేయకుండా.. పార్టీ తరఫున అండగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం సొంత ఆస్తులు అమ్మకానికి పెట్టారు. 20 కోట్లకు ఇప్పటికే ఓ ఇంటి స్థలం అమ్మేశారు. మరో రెండు మూడు ప్రాపర్టీలను కూడా అమ్మేందుకు సిద్ధం అయ్యారు. ఐతే తమ్ముడికి సాయమో.. లేదంటే మరే కారణమో కానీ.. పవన్ అమ్మబోయే ఆస్తులను కొనేందుకు అన్నయ్య చిరంజీవి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్‌కు అండగా నిలిచేందుకు.. ముందుకు వచ్చినట్లు టాక్.

ఈ రోజుల్లో ఒక్కసారి పోగొట్టుకున్న ఆస్తులను మళ్లీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అలాంటిది తన తమ్ముడు ఈ రాజకీయాల కోసం.. కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్లు, భూములను అమ్మెందుకు రెడీ అయ్యారని తెలిసి చిరు రంగంలోకి దిగారట. వాటిని తనే కొనుగోలు చేసి.. సరైన సమయంలో తిరిగి తమ్ముడికే అందేలా చేయాలనుకుంటున్నారట. ఇందులో నిజం ఎంత అన్న సంగతి ఎలా ఉన్నా.. ఈ విషయం మాత్రం సినిమా, పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.