Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

ఒక హెవీ యాక్షన్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చెరువులో దిగి ఫైట్ చేసినట్లుగా.. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆ చెరువులో బురద ఎక్కువగా పేరుకుపోయిందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2024 | 11:22 AMLast Updated on: Mar 21, 2024 | 11:22 AM

Megastar Chiranjeevi Doing Action Sequens Without Dupe For Vishwambhara

Chiranjeevi: కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన మల్లిడి వశిష్ట భారీ సోషియో ఫాంటసీ డ్రామాగా విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా జనవరి 10న విశ్వంభర రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. విజువల్ వండర్‌గా ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మేకర్స్.

PITHAPURAM: పిఠాపురంలో పవన్ ఓటమికి.. వైసీపీ త్రికోణ వ్యూహం

మొన్నటి వరకు పాట చిత్రీకరణ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులలోని ఒక చెరువు దగ్గర్లో జరుగుతుందని తెలుస్తోంది. ఒక హెవీ యాక్షన్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చెరువులో దిగి ఫైట్ చేసినట్లుగా.. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆ చెరువులో బురద ఎక్కువగా పేరుకుపోయిందట. అయినా కూడా.. రిస్క్ అని తెలిసినా సరే.. డూప్‌ లేకుండా ఈ ఫైట్ చేస్తున్నారట చిరు. ఒంటి నిండ బురదతో పాటు, దుమ్ములో చాలా ఇబ్బంది పడుతున్నారట మెగాస్టార్. డూప్ అవసరం లేదని.. పట్టుబట్టి మరీ ఈ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారట చిరు.

అందుకే మెగాస్టార్ అయ్యాడు. ఊరికే ఎవరు అవరని అంటున్నారు మెగాభిమానులు. అసలు.. రిస్క్ లేకుంటే మెగాస్టార్ ఈ స్థాయికి వచ్చేవారే కాదు. ఇలాంటి బురద, దుమ్ములో చేయను అంటే.. ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. అందుకే.. విశ్వంభర కోసం కష్టమైనా కూడా యాక్షన్‌ సన్నివేశాలను చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలా అరిస్తారో చూడాలి.