MEGASTAR CHIRANJEEVI: చిరుతో మంచు విష్ణు.. క్రెడిట్ అంతా కన్నప్పదే..

మోహన్ బాబు కూడా ఈ సినిమాలో యాడ్ అవుతున్నాడని తెలియగా మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో నటించనున్నాడని తెలియడంతో ఎగిరి గంతేస్తున్నారు మూవీ లవర్స్. మంచువారబ్బాయి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా యాడ్ అవుతున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 02:30 PMLast Updated on: Nov 27, 2023 | 2:30 PM

Megastar Chiranjeevi In Manchu Vishnus Kannappa

MEGASTAR CHIRANJEEVI: భక్త కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనపించనున్నాడు. ప్రభాస్ క్యామియో చేస్తున్నాడు అని తెలియడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రభాస్ మాహాశివుడిగా, పార్వతి దేవి పాత్రలో నయనతార నటిస్తుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది.

kantara: ఈసారి అంతకు మించి.. కాంతార ఛాప్టర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్..

అయితే ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు భక్త కన్నప్పలో కనపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో.. కన్నడ, మళయాళం నుంచి ఇద్దరు సీనియర్ హీరోలను రంగంలోకి దింపుతున్నాడు మంచు విష్ణు. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడనే విషయంలో క్లారిటీ రాలేదు. అంతేకాకుండా మోహన్ బాబు కూడా ఈ సినిమాలో యాడ్ అవుతున్నాడని తెలియగా మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో నటించనున్నాడని తెలియడంతో ఎగిరి గంతేస్తున్నారు మూవీ లవర్స్. మంచువారబ్బాయి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా యాడ్ అవుతున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో అదిరిపోయే రోల్ కోసం మెగాస్టార్‌ని సంప్రదిస్తున్నారంట. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం మోహన్ బాబు.. చిరంజీవిని సంప్రదించారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మోహన్ బాబుతో ఉన్న చనువుతో నటించేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి మంచు విష్ణు.. ఈ ప్రాజెక్ట్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాడు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.