Chiranjeevi: చిరుకు మేజర్ సర్జరీ.. ఏమైంది?
మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్‌గా మిగిలింది. ఫ్యాన్స్ అంతా ఈ బాధలో ఉండగానే.. మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారంలో చిరంజీవికి మేజర్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ గుప్పుమంటోంది.

Megastar Chiranjeevi is all set for knee surgery.
మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్‌గా మిగిలింది. ఫ్యాన్స్ అంతా ఈ బాధలో ఉండగానే.. మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారంలో చిరంజీవికి మేజర్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ గుప్పుమంటోంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ మెగాస్టార్.. 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకునేందుకు రెడీ అవుతున్నారని టాక్. హైదరాబాద్ కాకపోతే.. ఢిల్లీ లేదా బెంగళూరులో ఈ ఆపరేషన్ జరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ తర్వాత దాదాపు 2నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్జరీ అయి పూర్తిగా కోలుకున్నాకే కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి భోళాశంకర్ రిలీజ్‌కు ముందు నుంచే చిరంజీవి మాయం అయ్యారు. ఈ ఆపరేషన్ పనుల్లో బిజీగా ఉన్నారు.ఇక అటు మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్‌కు మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఐతే ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఇకపోతే బింబిసార డైరెక్టర్ వశిష్టతో చిరు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఫైనలవుతుందో.. ఏది చిరుకు విజయాన్ని బహుమతిగా ఇస్తుందో చూడాలి. ఆపరేషన్ తర్వాత నెల రోజుల పాటు రెస్ట్ అంటే.. షూటింగ్‌కు చిరు భారీ బ్రేక్ తీసుకోవడం ఖాయం.