MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది హాట్ బ్యూటీ. ఆ పాట తెచ్చిన పాపులారిటీతో ముద్దుగుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాలలో సొగసరి చేసిన స్పెషల్ సాంగ్స్‌ను యూత్, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 02:50 PMLast Updated on: Feb 19, 2024 | 2:50 PM

Megastar Chiranjeevi Is Doing Again Special Song With Urvashi Rautela

MEGASTAR CHIRANJEEVI: బాలీవుడ్ తెరపై గ్లామరస్ బ్యూటీగా ఊర్వశీ రౌతేలాకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్‌గా బ్యూటీకి వచ్చిన అవకాశాలు తక్కువే. పడిన హిట్లు కూడా తక్కువే. అయితే, సోషల్ మీడియాలో కనిపించే ఈ చిన్నదాని క్రేజ్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. తన హాట్ లుక్స్‌తో ఆమె ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే వెళుతోంది. మంచి ఫిట్‌నెస్‌తో తన అభిమానుల జాబితాను పొడిగిస్తూనే ఉంది.

RAM GOPAL VARMA: టీ గ్లాస్‌ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్

అలాంటి ఊర్వశి ఈ మధ్యనే సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది హాట్ బ్యూటీ. ‘బాస్ పార్టీ’ అంటూ సాగే ఈ పాట జనంలోకి ఒక రేంజ్‌లో దూసుకుపోయింది. ఆ పాట తెచ్చిన పాపులారిటీతో ముద్దుగుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాలలో సొగసరి చేసిన స్పెషల్ సాంగ్స్‌ను యూత్, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఇప్పుడీ బ్యూటీ ఇక్కడ మరింత బిజీ అయింది. బాలకృష్ణ – బాబీ సినిమాలో ఆమె ఒక హీరోయిన్‌గా అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరోసారి మెగాస్టార్ చిరంజీవితో చిందులు వేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కనున్న ‘విశ్వంభర మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగు దశలో ఈ సినిమా ఉంది. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం ఊర్వశీ రౌతేలాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఊర్వశీ అందాల సందడి నార్త్‌లో కంటే సౌత్‌లోనే సక్సెస్ ఫుల్‌గా సాగుతోందని చెప్పుకోవాలి. బాస్ పార్టీ అంటూ వాల్తేరు వీరయ్యలో రచ్చ చేసిన బ్యూటీ.. మరోసారి చిరుతో ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.