Megastar Chiranjeevi : మిడిల్ క్లాస్ పర్సన్ గా చిరు…
మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు జానర్ మారుస్తూ కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో అచీతూచీ అడుగులు వేస్తున్నాడు.

Megastar Chiranjeevi is on the rise. Changing the genre of the movie, the boy heroes are giving a tough fight.
మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు జానర్ మారుస్తూ కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో అచీతూచీ అడుగులు వేస్తున్నాడు. మొన్నటి వరకు చేతిలో నాలుగు సినిమాలతో దూకుడు చూపించిన చిరు ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ కాగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజా ఫ్లాప్ డైరెక్టర్ తో హిట్ కొట్టేందుకు ఆరాటపడుతున్నాడు.
ప్రజెంట్ చిరు విశ్వంభర మూవీతో బిజీగా మారాడు. రెస్ట్ లేకుండా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆగస్ట్ తొలివారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈషెడ్యూల్ లో యాక్షన్ సీన్లతో పాటు మూడు పాటల చిత్రీకరణ జరగనుందట. అందుకోసం భారీ సెట్స్ సైతం వేశారట. అయితే ఒకటి చిరు ఇంటడ్రక్షన్ సాంగ్ కాగా… మిగిలన రెండు రొమాంటిక్ టచ్ లో ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి మ్యూజిక్ పనుల్లో బిజీగా మారిపోయారు. తాజాగా చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
చిరు గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో మరో సినీమా చేయడానికి బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈసారి రిమేక్లు కాకుండా స్ట్రెయిట్ సబ్జెక్టు తో వస్తున్నట్టు టాక్. BVS రవి ఈ సినిమాకు కథ అందించనున్నారట. మెగా బాస్ ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. ఒక మిడిల్ ఏజ్డ్ పెళ్లి అయిన పర్సన్ గా చిరు కనిపించనున్నాడ. రోల్ లో గురించి తెలిసి చిరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నా… మోహన్ రాజా అనగానే టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరీ ఈ సారి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో.