CHIRANJEEVI: మెగా మూవీ.. 2025 మేలో రిలీజ్ అయ్యేలా వశిష్ట ప్లానింగ్..!
డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్‌లోనే మెగాస్టార్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ట మేకింగ్‌లో చిరు సోషియో పాంటసీ సినిమా మొదలు కానుంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించబోతున్నారట.
CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే నెలరోజుల నుంచి ఫిజియో థెరపీ జరుగుతోంది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకి ఆన్సర్ దొరికంది. నవంబర్ న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతోంది. కాబట్టి అప్పటి వరకు చిరు ఏ సినిమా కూడా సెట్స్‌పైకెళ్లదు. ఆ తర్వాత కూడా చిరు ఫిజియో థెరపీనే జరుగుతుంది. సో.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్‌లోనే మెగాస్టార్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు.
బింబిసార డైరెక్టర్ వశిష్ట మేకింగ్‌లో చిరు సోషియో పాంటసీ సినిమా మొదలు కానుంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించబోతున్నారట. తెలుగు, హిందీ ఇలా రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ని కూడా ఫిల్మ్ టీం సంప్రదించింది. ఐష్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదు కానీ.. దాదాపు ఓకే అయినట్టే అని లీకులు పెరిగాయి. ఏదేమైనా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తాలూకు టూల్స్‌ని రూ.12 కోట్లు పెట్టి హైదరాబాద్‌కి దిగుమతి చేసుకుందట ఫిల్మ్ టీం. ఇక డిసెంబర్‌లో షూటింగ్ మొదలైతే కరెక్ట్‌గా 6 నెలల 15 రోజులు టాకీ పార్ట్, మరో 15 రోజులు సాంగ్స్ షూటింగ్, ఆ తర్వాత 8 నెలలు కేవలం గ్రాఫిక్స్ వర్క్‌కే కేటాయించారట. అలా చూస్తే 2025 మేలో ఈ సినిమా రిలీజ్ అయ్యేఛాన్స్ ఉంది.
సీక్వెల్ కూడా ఉండేలానే ముల్లోక వీరుడిని ప్లాన్ చేస్తున్నారు. అయితే హిందీ ఆడియన్స్ కోసం ఈ సినిమా టైటిల్‌ని త్రిలోక వీర అని కూడా అనుకుంటున్నారట. ఇలా చిరు సెట్లో అడుగు పెట్టేలోగా ప్రి ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసేస్తోంది వశిష్ట టీం.