MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్.. అనిల్ రావిపూడి కాంబోలో సినిమా.. ఎప్పుడు మొదలంటే..
భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత బ్రో డాడీ రీమేక్‌ని విరమించుకున్నాడు చిరు. ఆ టైంలోనే అనిల్ రావిపూడి సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టాడట. వశిష్ట మేకింగ్‌లో చేసే పాన్ ఇండియా సినిమాకు మాత్రమే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదయ్యాక అనిల్ రావిపూడి సినిమా చేయాలనేది మెగాస్టార్ సూపర్ ప్లాన్ అని తెలుస్తోంది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీ ఏడాదిగా గుసగుసల్లోనే నానుతోంది. చిరు చెప్పడం, అనిల్ రావిపుడి కాదనటం జరుగుతుందా..? అందుకే మెగా ఆఫర్ రాగానే అనిల్ ఓకే చెప్పాడట. కానీ, అదేంటో మొన్నటి వరకు బాలయ్య తర్వాత చిరుతో అనిల్ సినిమా అంటే అవన్నీ రూమర్స్ అనేశాడు ఈ దర్శకుడు. దానికి ఒక కారణం ఉంది. సడన్‌గా తను రవితేజ సినిమాకు కమిటవ్వటానికి కూడా కారణం అదే అంశంమట. అదే చిరు పాన్ ఇండియా మూవీ.
GAME CHANGER: శంకర్ నిర్ణయంతో టాలీవుడ్‌లో మారనున్న లెక్కలు..
భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత బ్రో డాడీ రీమేక్‌ని విరమించుకున్నాడు చిరు. ఆ టైంలోనే అనిల్ రావిపూడి సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టాడట. వశిష్ట మేకింగ్‌లో చేసే పాన్ ఇండియా సినిమాకు మాత్రమే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదయ్యాక అనిల్ రావిపూడి సినిమా చేయాలనేది మెగాస్టార్ సూపర్ ప్లాన్ అని తెలుస్తోంది. సో.. ఇది జరగాలంటే చిరుతో వశిష్ట తీస్తున్న మూవీ పూర్తవ్వాలి. ఈ మూవీ తీసేందుకు కనీసం 10 నెలల టైం పడుతుంది. అప్పటి వరకు అనిల్ రావిపూడి వేయిట్ చేయటం కంటే.. ఈలోపు షార్ట్ కట్‌లో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట. ఎలాగూ తక్కువ రోజుల్లో సినిమా తీయటంలో అనిల్ ఎక్స్‌పర్ట్ అయ్యాడు. ఇలాంటి ప్రాజెక్టులే రవితేజ కోరుకుంటాడు.
అందుకే ఆ ప్రాజెక్ట్ కథని రెడీ చేసి, జనవరిలో లాంచ్ చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావిపూడి. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది దీపావళికి చిరుతో అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకెళ్లొచ్చు.