MEGASTAR CHIRANJEEVI: విశ్వంభరలో.. మెగాస్టార్ ఒక్కడే కాదు..
ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ వేయబోతున్నాడట. అంటే 80 ఏళ్ల వృధ్దుడిగా, పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడా అంటే, అందులో సగమే నిజమని తెలుస్తోంది. చిరు వృధ్దుడిగా తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పేప్రయాణంలో పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడు.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తీస్తున్న మూవీ విశ్వంభర. ఈ సినిమా రెండో షెడ్యూల్‌లోనే సాంగ్‌ని షూట్ చేయాలనుకోవటానికి కారణం.. అది గ్రాఫిక్స్ ఎక్కువగా వాడాల్సిన అవసరమున్న సాంగ్ అని తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య నేలమీదకొచ్చినప్పుడు వచ్చే పాటలానే, విశ్వంభరలో ఇంద్రలోకం సాంగ్ ప్లాన్ చేశారట. ఆ పాటకి గ్రాఫిక్స్ ఎక్కువ అవసరం కాబట్టి, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే, సాంగ్స్, సీన్స్ ముందు తీసి, తర్వాత మిగతా పార్ట్ తీస్తారు.
Trisha : డేటింగ్ ఒక్కరితో చేయలేదు…
ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ వేయబోతున్నాడట. అంటే 80 ఏళ్ల వృధ్దుడిగా, పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడా అంటే, అందులో సగమే నిజమని తెలుస్తోంది. చిరు వృధ్దుడిగా తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పేప్రయాణంలో పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడు. అంటే ఒకే వ్యక్తి రెండు గెటప్స్ అనుకోవాలి. కాని డ్యూయెల్ రోలేంటనే ప్రశ్న తలెత్తుతుంది. దాని ప్రకారం చూస్తే చిరు తన కథ చెప్పేది కూడా చిరుకే అని తెలుస్తోంది. తన కొడుక్కి తండ్రి చెప్పే కథగా విశ్వంభర మొదలౌతుందట. అలా చిరు డ్యూయెల్ రోల్ వేయబోతున్నాడట. ఖైదీ నెంబర్ 150, అందరివాడు, ముగ్గురు మొనగాళ్లు వంటి కొన్ని సినిమాల్లో చిరు ఇలా డబుల్ రోల్, త్రిబుల్ రోల్ కాన్సెప్ట్‌తో రిస్క్ చేశాడు. చరణ్ కూడా నాయక్‌తో అలాంటి ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు చిరులాగే చరణ్ కూడా గేమ్ ఛేంజర్‌లో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. కల్కిలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ కన్ఫామ్ అయ్యింది. మహాభారతంలో కర్ణుడిగా, అలానే విష్ణుదేవుడి కల్కి అవతారంగా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడట. పాన్ ఇండియా మూవీల్లో హీరో డ్యూయెల్ రోల్ వేసే ట్రెండ్ మాత్రం ఇలా చిరు, ప్రభాస్, చరన్ మొదలుపెట్టారు. దేవరలో మూడు పాత్రలేస్తూ తారక్ కూడా అదే బాటలో నడిచేలా ఉన్నాడు.