MEGASTAR CHIRANJEEVI: చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆయన సాధించిన అవార్డులు ఇవే
దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి నటుడు కూడా చిరంజీవే. ఆయనకు 1987లో ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందింది. తన సినీ కెరీర్‌లో పలు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులతోపాటు అనేక అవార్డులు అందుకున్నారు.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. పద్మ విభూషణ‌్ అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించే రెండో అతిపెద్ద పురస్కారం పద్మ విభూషణ్ అవార్డే. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడం ఇది రెండోసారి. 2006లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. అదే ఏడాది ఆయనకు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. తొమ్మిదిసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
Chiranjeevi, Padma Vibhushan : మెగాస్టార్‌కి పద్మవిభూషణ్ రావడం వెనుక అసలు కారణం ఇదే..!
దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి నటుడు కూడా చిరంజీవే. ఆయనకు 1987లో ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందింది. తన సినీ కెరీర్‌లో పలు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులతోపాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. దీనిద్వారా తన అభిమానులతో కలిసి రక్తదాన, నేత్రదాన సేవలు అందిస్తున్నారు. గత కోవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, వైద్య సేవల్లో పాలు పంచుకున్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం కోవిడ్ సమయంలో ఆర్థిక సాయం అందించారు. సునామీలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తన వంతు విరాళం అందించారు. సినిమాల్లోనే కాకుండా.. చిరంజీవి బుల్లితెరపైనా అలరించారు. 2017లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి హోస్టుగా వ్యవహరించారు. ఇప్పటివరకు 155 చిత్రాల్లో నటించిన చిరంజీవి త్వరలో విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1988లో చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రం నర్గీస్‌దత్ జాతీయ సమగ్రత ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.
చిరంజీవికి దక్కిన కొన్ని అవార్డులు
ఉత్తమ నటుడిగా నంది అవార్డులు: స్వయంకృషి (1987), ఆపద్బాంధవుడు (1992), ఇంద్ర (2002)
ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు: శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్‌దాదా ఎంబీబీఎస్ (2004), స్పెషల్ అవార్డ్ (సౌత్) 2006, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ (సౌత్) 2010
2006లో పద్మభూషణ్ అవార్డు
2006లో గౌరవ డాక్టరేట్ (ఆంధ్రా యూనివర్సిటీ)
2014లో సైమా అందించే.. ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు
2016లో ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు
2022లో ఇఫి అందించే.. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు