MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ లాంటి మహావృక్షం.. తగ్గాల్సి వస్తోందా..?
చిరు సినిమాలంటేనే ఒకటి ప్లానింగ్‌లో ఉంటే ఇంకొకటి సెట్లో ఉంటుంది. మరొకటి ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంటుంది. ఇలా ఒకే సారి రెండు, మూడు సినిమాలు చేయటం చిరు స్టైల్. కాని సడన్‌గా తను హరీష్ శంకర్ మూవీకి సై అన్నాడు. కాని షూటింగ్‌కి నో చెప్పాడు.

MEGASTAR CHIRANJEEVI: మెగా స్టార్ చిరంజీవి 150 కి పైగా సినిమాలు చేశార. విశ్వంభర మూవీతో బిజీ అయ్యారు. రెండు పాటలు, 12 సీన్లను తెరకెక్కించిన ఫిల్మ్ టీం క్వాలిటీ కోసం పక్కా ప్లానింగ్ తో స్టో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటోంది. ఇక చిరు సినిమాలంటేనే ఒకటి ప్లానింగ్‌లో ఉంటే ఇంకొకటి సెట్లో ఉంటుంది. మరొకటి ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంటుంది. ఇలా ఒకే సారి రెండు, మూడు సినిమాలు చేయటం చిరు స్టైల్.
RAM CHARAN: శంకర్ నిర్ణయంతో పవన్, బన్నీ సినిమాలకు షాక్..!
కాని సడన్‌గా తను హరీష్ శంకర్ మూవీకి సై అన్నాడు. కాని షూటింగ్‌కి నో చెప్పాడు. అనిల్ రావిపుడి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాని షూటింగ్ అంటే వేయిట్ అండ్ సీ అంటున్నాడు. అదే చిరంజీవిలో వచ్చిన కొత్త మార్పంటూ చర్చ జరుగుతోంది. 68ఏళ్ల చిరు ఆగస్ట్ వస్తే 69లోకి అడుగు పెడతారు. మరి ఇలా ఏజ్ సమస్య.. లేదంటే, చరణ్‌కి ఇచ్చిన మాట వల్లో కాని సడన్‌గా చిరు వెనకడుగు వేశారు. విశ్వంభర షూటింగ్ పూర్తయ్యాకే హరీష్ శంకర్ సినిమా చేస్తాడట చిరు. ఆ తర్వాతే అనిల్ రావిపుడి మూవీ మొదలౌతుందట.
అంతేకాని.. ఇక మీదట కథ ఎంతనచ్చినా ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయకూడదనేది చిరు నిర్ణయం అని తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్‌కి ఇచ్చిన మాట ప్రకారం చిరు పద్దతే మారిపోతోందని తెలుస్తోంది.