Tollywood: వినోదాన్నిచ్చే హీరో.. విహారంలో.. వయా విమానంలో
సెలవులు ఇవ్వడం వేరు మనం తీసుకవడం వేరు. వేసవి సెలవులు యూభై రోజులు ఇచ్చినా పెద్దగా ఆనందం ఉండదు. అదే ఒక్కరోజు తమంతటతాము సెలవు తీసుకుంటే వచ్చే కిక్కే వేరప్ప. ఇది స్కూల్, కాలేజ్ చదువుతున్న పిల్లలకు బాగుంటుంది. అయితే సినిమా వాళ్లకు అలా కాదు. ఏడాదిలో అధిక భాగం షూటింగుల పేరుతో ఇంట్లో వాళ్లతో గడిపేందుకు తీరిక ఉండదు. ఒక వేళ తీరిక ఉన్నా ప్రమోషన్స్, డబ్బింగ్ పనుల్లో ఉండటం వల్లే ఓపిక ఉండదు. అందుకే వారు కోరుకున్నప్పుడు హాలిడే తీసుకొని అందులో భాగంగా సుదూర ప్రాంతాలు లేకుంటే విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తారు. దీనినే హాలిడే ట్రిప్ అంటారు. ఇలా చాలా మంది హీరోలు తమ భార్యా, పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు.

Chiranjevi And Surekha Went to Holiday trip to America
ఇలా ట్రిప్ ప్లాన్ చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల తన మ్యారేజ్ డే సందర్భంగా భార్య నమ్రతాతోపాటూ ఇద్దరు పిల్లలను పిలుచుకొని యూరప్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇలాంటి వాటికి జూనియర్ ఎన్టీఆర్ తక్కువ ఏమీ కాదు. తన ఇల్లాలితో కలిసి ఇంగ్లాడ్ వెళ్లి హాలిడే జాలీగా గడిపారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కూతురికి జన్మనిచ్చేందుకు కొన్ని వారాల ముందే దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ప్రముఖ యాంకర్లు కూడా ఈ హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మన్నటికి మన్న జబర్ధస్త్ ఫేం అనసూయ తన భర్తతో కలిసి థాయిలాండ్ లో తిరుగుతూ పిచ్చ పిచ్చగా ఆనందంలో మునిగి తేలారు. అదే కోవలోకి యాంకర్ హృదయభాను కూడా చేరారు. తన కవల పిల్లలను పిలుచుకొని అమెరికాలోని చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శిస్తున్నారు.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీరి బాట పట్టారు. మన్నటి వరకూ భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక సంగీత్ పాటను కూడా ఇన్ స్టాలో పోస్ట చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కూడా తాజాగా పూర్తి చేసుకున్నారు. అందుకే హాలిడే ట్రిప్ ప్లాన్ చేసి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతున్నాయి. ప్లైట్ లో ఒక సీటులో చిరు, పక్క సీటులో ఆయన సతీమణి కూర్చున్న తీరు.. అందులోని ఇంటీరియర్, ఫర్నీచర్ చూసేందుకు చాలా రిచ్ గా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇలా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రకృతిని, వింతైన ప్రదేశాలను చూస్తూ సినిమాలో పడిన కష్టాన్ని వదిలేస్తారు. మళ్లీ ఫ్రెష్ మైండ్ తో ఇండియా తిరిగి వచ్చి షూటింగ్, ఫైటింగ్ అంటూ బిజీబిజీగా గడుపుతారు. ఇది వినోదాన్ని ఇచ్చే వారు చేసే విహారం. అయితే ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది.
T.V.SRIKAR