MEGASTAR CHIRANJEEVI: చిరుతో శ్రీలీల.. ఐదుగురు ముద్దుగుమ్మలతో మెగా రొమాన్స్..!

పంచభూతాలను కలుపుతూ.. మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని, అందుకే.. టైటిల్ ముల్లోక వీరుడు, విశ్వంభర అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 05:48 PMLast Updated on: Nov 01, 2023 | 5:48 PM

Megastar Chiranjeevi Will Act With Sreeleela In Mega 156

MEGASTAR CHIRANJEEVI: ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోవాలి అని సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి (MEGASTAR CHIRANJEEVI). బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 156 (MEGA 156) ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది మెగా 156. కీరవాణి మ్యూజిక్‌ వర్క్‌తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే. కాబట్టి ఈ సినిమాకు విజవల్ వర్క్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు మెగాస్టార్. పంచభూతాలను కలుపుతూ.. మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని, అందుకే.. టైటిల్ ముల్లోక వీరుడు, విశ్వంభర అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు సైతం జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులను కూడా చిత్ర బృందం పరిశీలిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నట్టు ముందు నుంచి టాక్ ఉంది. అందులో ఇద్దరు సీనియర్ బ్యూటీలు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరిలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. హనీ రోజ్‌, రెజీనా కసాండ్ర, శ్రీ లీల కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని సమాచారం. ఓ పాప కోసం ఈ లోకాలన్నీ చుట్టొచ్చే చిరుకి లోకానికి ఒక్కరు చొప్పున మొత్తం 5 లోకాల్లో ఐదుగురు కథనాయికలతో చిందేయనున్నారు. దీంతో మెగా అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2024 ఎండింగ్ లేదా.. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి మెగా 156 ఎలా ఉంటుందో చూడాలి.