MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ సారథ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్.. పండగే..పండగ..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా-నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం పెస్టివల్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ చిత్రోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Padma Shri.. Padmavibhushan OK? Where is Chiranjeevi actor?
MEGASTAR CHIRANJEEVI: సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అన్నది ఎంతో మందికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే.. ఈ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియని అయోమయంలో ఎంతో మంది ప్రతిభావంతులైన యువతీ యువకులు అవకాశాలు కోల్పోతున్నారు. అందుకే.. సినీ పరిశ్రమకు రావాలనుకునే ఔత్సాహిక ఫిలింమేకర్స్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక వేదిక అవసరం. అలాంటి ఒక వేదికే ఈ ఫెస్టివల్ అంటున్నారు సౌతిండియా ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు.
ssmb 29: జపాన్ ప్రేక్షకులకు రాజమౌళి గ్రేట్ ప్రామిస్.. ఖుషీలో మహేష్ ఫ్యాన్స్ !
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా-నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం పెస్టివల్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ చిత్రోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సినిమాల ప్రదర్శనలు, చర్చలతో కూడిన ఈ ఉత్సవాలు పరిశ్రమలో ఎదగాలనుకునే ప్రతిభావంతులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయని. కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి దోహదం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సినిమాల ప్రదర్శనతో పాటు.. గ్రూప్ డిస్కషన్స్.. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్.. ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. నవతరం ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదుకు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ చర్చలు, ఔత్సాహిక ఫిలింమేకర్స్‌ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. కొత్త ప్రతిభావంతులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఓ ఎనర్జిటిక్ ప్లాట్‌ఫామ్‌గా మారడం ఖాయమంటున్నారు నిర్వాహకులు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన.. పద్మవిభూషణ్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన్ను గౌరవించుకుంటూనే.. ఆయన సారథ్యంలోనే వేడుకలు గ్రాండ్‌గా జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. స్వయంకృషితో, నిరంతర కృషి, పట్టుదలతో మెగాస్టార్‌గా కొనసాగుతున్న చిరంజీవికి ఈ ఫెస్టివల్ ఓ అరుదైన గౌరవ వేదికగా మారనుంది. మెగాస్టార్ సారథ్యంలో జరగనున్న ఈ వేడుకలు సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న ప్రతిభావంతులకి ఓ అరుదైన అవకాశంగా మారడం ఖాయమంటున్నారు. అంతేకాకుండా.. అల్లు అరవింద్, విశ్వ ప్రసాద్, శైలేష్ ఆర్ సింగ్, దీపక్ ధర్, సుజయ్ రే, శేతాన్షు దీక్షిత్, మయాంక్ శేఖర్, రాజీవ్ మసంద్ వంటి విభిన్న ప్రతిభావంతులతో ఔత్సాహిక ఫిలింమేకర్స్ చర్చించేందుకు కూడా ఈ ఫెస్టివల్‌లో అవకాశం కల్పించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.