ఇది మెగా ఒరిజినాలిటీ.. మనవరాలు పుడితే పాపమా…? తాత గురించి చెప్పడానికి ఏం లేదా..?
మెగాస్టార్ చిరంజీవి.. లేటెస్ట్ గా ఈవెంట్లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన తాత పై అలాగే రామ్ చరణ్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. లేటెస్ట్ గా ఈవెంట్లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన తాత పై అలాగే రామ్ చరణ్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. దీనిపై ఇప్పుడు మెగా ఫాన్స్ కూడా కొంత ఫైర్ అవుతున్నారు. తనకు వారసుడు కావాలని, రామ్ చరణ్ కు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయం.. తనలో ఉందని చిరంజీవి కామెంట్ చేశారు. దీనిపై ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఫైర్ అయిపోతున్నారు. చిరంజీవి ఆ స్థాయిలో ఉండి.. ఆడపిల్లలను అవమానించడం ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారు.
2025 లో కూడా వారసత్వం గురించి ఏ స్థాయిలో మాట్లాడటం ఏంటని… అసలు పిల్లల లేక కొంతమంది బాధపడుతుంటే.. ఆడపిల్ల పుడుతుందేమోనని భయపడాల్సిన అవసరం ఏముందని కొంతమంది మండిపడుతున్నారు. చిరంజీవి నుంచి తాము అసలు ఇలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదని మెగా అభిమానులు కూడా కొంతమంది కామెంట్ చేయడం గమనార్హం. ఈ మధ్య మెగా ఫ్యామిలీ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటుంది. అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదం.. ఈ మధ్య కాస్త చల్లారినట్లు కనపడింది.
కాని చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. వారసుడు కోరుకోవడంలో తప్పు లేదని కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక తన తాత గురించి కూడా చిరంజీవి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాత రసికుడు అని, వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారని బయట మరో అమ్మమ్మ ఉండేది అంటూ చిరంజీవి మాట్లాడారు. ఇక తన తాతకు ఎన్ని అఫైర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదని.. బయట చాలా ఉండొచ్చు అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
చిరంజీవి ఈ స్థాయిలో ఉండి తన తాత గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని.. కొంతమంది మండిపడుతున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ప్రతిసారి మెగా ఫ్యాన్స్ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవిని మెగా ఫాన్స్ లో కూడా కొంతమంది టార్గెట్ చేయడం గమనార్హం. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ చిరంజీవి మాత్రం తన క్యారెక్టర్ గొప్పదని చెప్పుకునే క్రమంలో.. తన తాతను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని మరి కొంతమంది మండిపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఏ అఫైర్లు లేవని చెప్పుకునే క్రమంలో… చిరంజీవి తన తాత గురించి ప్రస్తావించారు. ఇది చిరంజీవి కంటే ఆయన తల్లికి చాలా అవమానం అని.. మరికొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని సోషల్ మీడియాలో అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. అటు రాజకీయాలపై కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.