Chiru : బెంగళూరులో విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.

Megastar Chiranjeevi's most awaited movie 'Vishwambhara'. Under the direction of Vashishta, UV Creations will produce this movie in a prestigious manner.
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. చిరంజీవి గతంలో నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీగా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఇక.. వశిష్ట తొలి చిత్రం ‘బింబిసార’ కూడా ఈ తరహాలోనే తెరకెక్కింది
ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘విశ్వంభర’ ఇప్పుడు పాటల కంపోజింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాకోసం బెంగళూరులో టీమ్ అంతా మ్యూజిక్ సిట్టింగ్స్ తో గడుపుతుంది. లేటెస్ట్ గా.. ‘మ్యూజిక్ సిట్టింగ్స్ బిగిన్ ఇన్ ఫుల్ స్వింగ్ ఎట్ బెంగళూరు’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది చిత్ర బృందం.
ఆస్కార్ విజేత కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవికి.. కీరవాణి మ్యూజిక్ ఇస్తోన్న మూవీ ఇది. బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్లిన వారిలో చిరంజీవి, కీరవాణి.. దర్శకుడు వశిష్టలతో పాటుగా.. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. మొత్తంమీద.. ఇదంతా చూస్తుంటే ‘విశ్వంభర’ మ్యూజిక్ సమ్‌థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.