Megastar Chiranjeevi: పాన్ ఇండియా లెవెల్లో విశ్వంభరగా మారిన మెగాస్టార్..
బింబిసార ఫేం వశిష్ట మేకింగ్‌లో చిరు చేయబోయే సినిమా టైటిల్ ముళ్లోక వీరుడు కాదు.. విశ్వంభర అని తేలింది. ఫిల్మ్ టీం ఆ టైటిల్ రిజిస్టర్ చేయించటం ద్వారా ఇదే చిరు సినిమా టైటిల్ అని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరగా మారాడు. బింబిసార ఫేం వశిష్ట మేకింగ్‌లో చిరు చేయబోయే సినిమా టైటిల్ ముళ్లోక వీరుడు కాదు.. విశ్వంభర అని తేలింది. ఫిల్మ్ టీం ఆ టైటిల్ రిజిస్టర్ చేయించటం ద్వారా ఇదే చిరు సినిమా టైటిల్ అని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. ఇక విశ్వంభర మూవీని రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కించబోతున్నారు. ఇందులో విలన్‌గా రానా కనిపించబోతున్నాడట.
ఆల్‌మోస్ట్ 50 రోజుల డేట్లు కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ప్రజెంట్ ఫిజియో థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిరు, డిసెంబర్ తర్వాత.. అంటే న్యూ ఇయర్ కి ఫిట్‌గా రెడీ అవ్వొచ్చని తెలుస్తోంది. ఆ లెక్కన జనవరి 4 కి సినిమాను షురూ చేసి జూన్ లోగా టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు వశిష్ట. విచిత్రం ఏంటంటే బింబి సారకి, విశ్వంభరకి స్టోరీలో కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఇది వశిష్టా సినిమాటిక్ యూనివర్స్‌గా రానుంది.
అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విశ్వంభర క్లైమాక్స్‌లో కామియో అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట. ఆచార్యలా కాకుండా కేవలం కామియో రోల్ కే చరణ్ పాత్ర పరిమితమౌతుందని తెలుస్తోంది. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి రైట్స్ కేవలం వైజయంతి మూవీస్‌కే పరిమితమని ఆ టీం తేల్చినా.. ఇది ఎన్టీఆర్ మూవీ జగదేక వీరుడి కథ ఆధారంగా తెరకెక్కుతుండటంతో, కాపీరైట్స్ సమస్య కూడా తొలిగిపోయిందట.