MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ ఎంట్రీకి ముందే.. అమ్ముడైన సినిమా రైట్స్

మెగాస్టార్ చిరంజీవి.. ఇంకా సెట్లోకి అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిరంజీవి షూటింగ్‌లో జాయిన్ అవుతారు. చిరు షూటింగ్‌కు హాజరు కాకముందే ఈ చిత్రం భారీ బిజినెస్ సొంతం చేసుకుంటుండటం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2024 | 08:15 PMLast Updated on: Jan 28, 2024 | 8:21 PM

Megastar Chiranjeevis New Movie Viswambhara Overseas Rights Sold Out

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువతరం దూసుకొచ్చినా.. తన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలకు ధీటుగా, భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Vc Sajjanar: బస్సుల్లో 12 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం.. అవసరమైతే వారి కోసం ప్రత్యేక బస్సులు..

సోషియో ఫాంటసీ కథతో, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గత నవంబర్‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే, మెగాస్టార్ చిరంజీవి.. ఇంకా సెట్లోకి అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిరంజీవి షూటింగ్‌లో జాయిన్ అవుతారు. చిరు షూటింగ్‌కు హాజరు కాకముందే ఈ చిత్రం భారీ బిజినెస్ సొంతం చేసుకుంటుండటం విశేషం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయట. ఈ హక్కుల్ని ఒక ప్రముఖ సంస్త రూ.20 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ బిజినెస్ అంటే.. అది అద్భుతమనే చెప్పాలి.

అయితే, షూటింగ్ ప్రారంభ దశలోనే ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోవడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇది చిరంజీవి స్టార్ పవర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో కథానాయికలుగా నయనతార, త్రిష, దీపికా పదుకొణె.. నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.