MEGASTAR CHIRANJEEVI: విశ్వంభర తర్వాత ఎవరితో.. చిరు కోసం త్రివిక్రమ్, పూరీ వెయిటింగ్..?
రీమేక్స్ వద్దు.. ఒరిజినల్ కథలే ముద్దు.. అని చిరు రూట్ మార్చాడు. అలాంటి తనతో సినిమా తీసే ఛాన్స్ ఆమధ్య వెంకీ కుడుములకి వచ్చింది. కాని కథ కనెక్ట్ కాక చిరు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాడన్నారు. ఇలాంటి పరిస్థితే పూరీకి గతంలో వచ్చింది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేం వశిష్ట మల్లిడి తీస్తున్న మూవీ విశ్వంభర. ఇది ఫిబ్రవరిలో మొదలై అక్టోబర్‌లోగా పూర్తవుతుందట. ఆ తర్వాత చిరు ఏం చేస్తాడు..? ఎవరితో మూవీ చేయబోతున్నాడనే ప్రశ్నకి ఆన్సర్ దొరకలేదు. రీమేక్స్ వద్దు.. ఒరిజినల్ కథలే ముద్దు.. అని చిరు రూట్ మార్చాడు. అలాంటి తనతో సినిమా తీసే ఛాన్స్ ఆమధ్య వెంకీ కుడుములకి వచ్చింది. కాని కథ కనెక్ట్ కాక చిరు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాడన్నారు.
KAMAL HAASAN: కమల్ హాసన్‌కి ఎన్టీఆర్ సాయం..
ఇలాంటి పరిస్థితే పూరీకి గతంలో వచ్చింది. ఆటోజానీ కథే కాదు, మరో కథ చెప్పినా సెకండ్ హాఫ్ నచ్చకే చిరు ఆ సినిమాను పక్కనపెట్టాడు. అటు వెంకీ కుడుముల.. బంగారం లాంటి ఆఫర్ మిస్ చేసుకుంటే, పూరీ మాత్రం ఇంకా కొత్త కథలతో మెగా దండయాత్రలు చేస్తున్నాడు. రీసెంట్‌గా చిరుకి కథ వినిపించిన పూరీ.. కాన్సెప్ట్ వరకు గ్రీన్ సిగ్నల్ పొందాడట. స్టోరీ డెవలప్ చేసి మెగాస్టార్‌ను ఇంప్రెస్ చేయటమే మిగిలి ఉందట. ఇక చిరు కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్‌లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు.
బన్నీతో మూవీ వాయిదా పడింది. నాని కమిట్‌మెంట్స్ వల్ల తనతో సినిమా కుదిరే పనిలా లేదు. రామ్‌తో అడ్జస్ట్ అవుతున్న తను, చిరు నుంచి కాల్ వస్తే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించటం ఖాయం అంటున్నారు. అసలే గుంటూరు కారం తన కంట్లో కారంగా మారటంతో, సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు గురూజీ.