Megastar Chiranjeevi: చిరు చెప్పిన మార్పులతో లేటుగా ముళ్లోక వీరుడి జర్నీ..!
భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరు మనసు మారిందట. అందుకే ముల్లోక వీరుడు కథలో మార్పులు చెప్పాడని తెలుస్తోంది. దీంతో కథకి రిపేర్లు చేయటానికే 50 రోజుల టైం అడిగాడట దర్శకుడు. సో.. దీపావళి తర్వాతే షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ పంచ్ తర్వాత జాగ్రత్తలు పెంచాడు. ఈ నెల 15కి బింబిసార దర్శకుడు వశిష్ట మేకింగ్‌లో మూవీ షురూ కావాలి. వర్కింగ్ టైటిల్ ముళ్లోక వీరుడంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కథకి రివర్స్ స్టోరీనే ఈ సినిమా అంటున్నారు. కాని భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరు మనసు మారిందట. అందుకే ముల్లోక వీరుడు కథలో మార్పులు చెప్పాడని తెలుస్తోంది. దీంతో కథకి రిపేర్లు చేయటానికే 50 రోజుల టైం అడిగాడట దర్శకుడు.
సో.. దీపావళి తర్వాతే షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన సంక్రాంతికి ఈ సినిమా అందుబాటులో ఉండటం సాధ్యం కాని పని. సమ్మర్ తప్ప ఈ మూవీ రిలీజ్‌కి మరో డేట్ లేదు. కాని మార్చ్ నుంచి మే వరకు చెర్రీ, ప్రభాస్, తారక్ ఆల్రెడీ రిలీజ్ డేట్లు బుక్ చేసుకున్నారు. అందుకే చిరు వచ్చేఏడాది దసరాకే ఈ సోషియో ఫాంటసీ మూవీని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. దానికి చాలా టైం ఉంది కాబట్టి, కథతోపాటు గ్రాఫిక్ వర్క్ హెవీగా ఉండే సీన్లే ముందు తీసేలా పక్కా ప్లానింగ్‌తో రమ్మన్నాడట చిరు. ఏదేమైనా భోళా శంకర్ దెబ్బతో చిరు తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.