CHIRANJEEVI: వంద కోట్ల నష్టానికి కోటితో మందు వేసిన మెగాస్టార్..?
భోళా శంకర్ పంచ్‌తో ఇక రీమేక్‌లు వద్దని చిరు డిసైడ్ అవటంతో మూవీ ఆగింది. ఆల్‌మోస్ట్ చిరు తన కూతురు కోసం రెమ్యునరేషన్ పక్కన పెట్టినా, బడ్జెట్ వందకోట్లని ప్లాన్ చేశారట. ఇంత చేసి భోళాశంకర్‌లా బ్రోడాడీ రీమేక్ కూడా షాక్ ఇస్తే.. రూ.వంద కోట్లు సమర్పయామి.
CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆగిపోయింది. దాని వల్ల రూ.కోటి నష్టం వచ్చింది. మెగాస్టార్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ఆయన కూతురు సుస్మిత నిర్మాతగా పట్టాలెక్కాల్సింది. కాని ఈ చిత్రం ఇప్పుడు ఆగిపోయింది. కొంతమందికి అడ్వాన్స్‌లు ఇచ్చేయటం, రైటర్లకు టెక్నీషియన్స్‌కి కొంత ఎమౌంట్ కట్టడంతోపాటు.. ప్రి ప్రొడక్షన్ రూపంలో ఈసినిమా కోసం రూ.కోటి వరకు ఈపాటికే ఖర్చు చేసింది మెగా డాటల్ సుస్మిత. అయితే, సడన్‌గా చిరంజీవినే ఈ సినిమాను ఆపేయమన్నాడట.
మలయాళ హిట్ మూవీ బ్రో డాడీకి రీమేక్‌గా ఈ మూవీని బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించాలి. కాని భోళా శంకర్ పంచ్‌తో ఇక రీమేక్‌లు వద్దని చిరు డిసైడ్ అవటంతో మూవీ ఆగింది. ఆల్‌మోస్ట్ చిరు తన కూతురు కోసం రెమ్యునరేషన్ పక్కన పెట్టినా, బడ్జెట్ వందకోట్లని ప్లాన్ చేశారట. ఇంత చేసి భోళాశంకర్‌లా బ్రోడాడీ రీమేక్ కూడా షాక్ ఇస్తే.. రూ.వంద కోట్లు సమర్పయామి. మరి మరో నిర్మాత అయితే ఇలానే చేసేవాళ్లో.. లేదంటే, మెగాడాటర్ వల్లే చిరు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఏదైతేనేం.. రూ.కోటితో పోయింది రూ.వందకోట్ల వరకెందుకని జాగ్రత్త పడుతున్నాడంటున్నారు. నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనా చిరుకి రీమేక్స్ కలిసొచ్చే ఛాన్స్ ఉన్నా, దర్శకుల ప్రతిభే భయానకంగా ఉంటోంది. అందుకే ఫ్రెష్ కథతోనే ముందుకెళ్లాలి అనుకుంటున్నారట చిరు. మొత్తంగా సినిమా ఆగింది. వందకోట్ల నష్టాన్ని చిరు కోటితో సరిపెట్టాడనే మాట కూడా వినిపిస్తోందిప్పుడు.