MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ పదో తరగతి సర్టిఫికెట్ చూశారా..!
చిరుకు సంబంధించిన ఓ సర్టిఫికెట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు సంబంధించిన ఏ మ్యాటర్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అది సినిమా న్యూస్ అయినా.. పర్సనల్ విషయమైనా.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో ఎవరెస్ట్ శిఖరం. స్వయంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. తనదైన డ్యాన్స్, నటనతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారాయన. సమాజసేవలోనూ చిరు తనవంతు సాయం చేస్తున్నాడు. రీసెంట్‌గా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నా.. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు.
Ustad Bhagathsingh : వన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ నుంచి బిగ్ సర్ ప్రైజ్
తాజాగా చిరుకు సంబంధించిన ఓ సర్టిఫికెట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు సంబంధించిన ఏ మ్యాటర్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అది సినిమా న్యూస్ అయినా.. పర్సనల్ విషయమైనా. ఇప్పుడు అలాంటి ఓ మ్యాటర్ బయటకు రావడంతో నెటిజన్లు ఆ విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రజెంట్ విశ్వంభర సినిమాతో వార్తల్లో నిలిచిన మెగాస్టార్.. ఇప్పుడు మరో వార్తతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నడుస్తున్న టైంలో చిరుకు సంబంధించిన 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చిందో.. ఎప్పుడు బయటకు వచ్చిందో కానీ.. చిరంజీవి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్‌గా మారిన చిరు సర్టిఫికేట్‌లో మెగాస్టార్ పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకట్ రావు అని కనిపించింది. చిరు.. పెనుగొండలో పుట్టినట్లు ఇందులో కనిపిస్తోంది. ఇప్పుడీ సర్టిఫికెట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మెగాస్టార్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే బయటకు వచ్చిన ఈ సర్టిఫికెట్‌పై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడో.. ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.