Vishwambhara: పూనకాలు లోడింగ్.. విశ్వంభర విలన్ దొరికాడు..

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఒక వర్సటైల్ యాక్టర్ విలన్‌గా చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ప్రేమికులని ఆనందంలో ముంచెత్తుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 02:06 PMLast Updated on: Mar 05, 2024 | 2:06 PM

Megastar Chiranjeevis Vishwambhara Movie Antagonist Is Rao Ramesh

Vishwambhara: మెగాస్టార్ నయా మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశతో ఎదురుచుస్తున్నారు. 2025 సంక్రాంతికిగాని వాళ్ల కోరిక నెరవేరదు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఒక వర్సటైల్ యాక్టర్ విలన్‌గా చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ప్రేమికులని ఆనందంలో ముంచెత్తుతుంది. విశ్వంభరలో విలన్‌గా రావు రమేష్ మెరవబోతున్నారు.

Mahesh Babu: బిజినెస్‌మేన్ మొదటి హీరో మహేశ్ కాదా.. ఈ సినిమా వదులుకున్న స్టార్ ఎవరంటే..

పైగా ఆయనే మెయిన్ విలన్. అన్ని సోషల్ మీడియాల్లోను ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుంది. చిరుని రావు రమేష్ ఢీ కొట్టబోతుండటంతో అందరిలోను విశ్వంభర ఆసక్తిని పెంచింది. పైగా మూవీలో రావు రమేష్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందని కూడా చర్చించుకుంటున్నారు. ఈ క్రేజ్ అంతటికి ఒక ముఖ్య వ్యక్తి కారణం. ఆయనే రావు రమేష్ తండ్రి దివంగత రావు గోపాలరావు గారు. గతంలో రావు గోపాలరావు, చిరంజీవి కాంబోలో లెక్కకు మించి సినిమాలు వచ్చాయి. చిరు నాయకుడుగా, రావు గోపాలరావు ప్రతినాయకుడుగా.. ఆ ఇద్దరి కాంబో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు ఆ ఇద్దరి నట విన్యాసాన్ని చూడటానికే రిపీటెడ్‌గా సినిమాకి వెళ్లే వాళ్ళు. ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పడు చిరు, రావు రమేష్ కాంబో కూడా హిట్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు. ఇక రావు రమేష్‌కి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

పైగా చిరంజీవి, రావు రమేష్ కాంబోలో వస్తున్న మొట్టమొదటి మూవీ కూడా ఇదే. యువి క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ విశ్వంభర మూవీని నిర్మిస్తున్నారు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. చిరుతో త్రిష జతకడుతుండగా ఇంకొంత మంది హీరోయిన్‌లకి కూడా మూవీలో చోటు ఉంది. చోటా కె నాయుడు ఫొటోగ్రఫీ అందిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న మూవీ విడుదల కాబోతుంది.