Megastar Chiranjeevi: విశ్వంభర నుంచి లేటెస్ట్ బజ్.. ఆ మెగా హిట్‌ మూవీ పంథాలోనే విశ్వంభర..

చిరంజీవి 156వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరు నటించిన ఓ సూపర్‌ హిట్‌ మూవీ పంథాలోనే విశ్వంభర కూడా ఉండనున్నట్లు ఓ బజ్ వినిపిస్తోంది. చిరంజీవి ఈ మూవీలో దొరబాబు పాత్రలో కనిపించనున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 03:21 PMLast Updated on: Feb 22, 2024 | 3:21 PM

Megastar Chiranjeevis Vishwambhara Movies Have An Interesting Backdrop

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీగా తెరకెక్కిస్తోంది. సంక్రాంతి సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన చిన్న వీడియోకు గూస్ బంప్స్ వచ్చాయి. దీంతో.. ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి ప్రముఖ ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Ashika Ranganath: మెగా ఛాన్స్.. ఆషికా వర్క్ అవుట్స్.. చిరంజీవి సినిమా కోసమేనా..?

చిరంజీవి 156వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరు నటించిన ఓ సూపర్‌ హిట్‌ మూవీ పంథాలోనే విశ్వంభర కూడా ఉండనున్నట్లు ఓ బజ్ వినిపిస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ అప్‌డేట్ ప్రకారం.. చిరంజీవి ఈ మూవీలో దొరబాబు పాత్రలో కనిపించనున్నారట. ఈ మూవీలో మెగాస్టార్‌కు ఐదుగురు అక్కచెల్లెల్లు ఉంటారని తెలుస్తోంది. ఇందులో ఉండబోయే సెంటిమెంట్, ఎమోషన్స్ ప్రకారం వారి పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇక గతంలో మెగాస్టార్ మెగా హిట్ మూవీ హిట్లర్‌లో కూడా ఆయన ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా కనిపించి ఆకట్టుకున్నారు. ఆ తరహాలోనే విశ్వంభరలో కూడా చిరు తన నట విశ్వరూపం చూపించబోతున్నారని ఫిలిం వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. కాగా.. ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం టీమ్ బాగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని ఇప్పటికే ప్రకటించారు. దీని కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఈ తరహా సినిమా కథల్లో చిరంజీవి నటించడం కొత్త కాదు. గతంలో జగదీక వీరుడు-అతిలోక సుందరి, అంజి ఇలాంటి జోనర్లే. జగదేకవీరుడు.. అతిలోక సుందరి మూవీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దీంతో.. ఇప్పుడు విశ్వంభర మూవీపై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. కాగా.. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.