Megastar OTT Entry : మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ…
టాలీవుడ్‌లో (Tollywood) కుర్ర హీరోలకు (Young Heroes) గట్టి పోటీ ఇస్తూ.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అనే చెప్పాలి.. అరవైలోనూ ఇరవై ఏళ్ల స్పీడ్‌తో ఏ మాత్రం తరగని చార్మింగ్‌తో దూసుకుపోతున్నారు మెగాస్టార్.. ప్రస్తుతం చిరు విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్నాడు.. మెగా 156 గా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి..
టాలీవుడ్‌లో (Tollywood) కుర్ర హీరోలకు (Young Heroes) గట్టి పోటీ ఇస్తూ.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అనే చెప్పాలి.. అరవైలోనూ ఇరవై ఏళ్ల స్పీడ్‌తో ఏ మాత్రం తరగని చార్మింగ్‌తో దూసుకుపోతున్నారు మెగాస్టార్.. ప్రస్తుతం చిరు విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్నాడు.. మెగా 156 గా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇటీవల విడుదల చేసిన టైటిల్ లుక్‌ను, కాన్సెప్ట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసాయి.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ క్రేజీ పుకారు ఫిలింనగర్ (Filmnagar) సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం తనను తాను ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకునే మెగాస్టార్.. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్లు రూటు మారుస్తున్నట్లు తెలుస్తోంది..
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఓటీటీ కంటెంట్ కి బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కడచూసినా ఓటీటీల హవానే నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లోని పెద్ద పెద్ద స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఏవీ దొరక్కపోతే రియాల్టీ షోలు కూడా చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్స్ కి అలవాటు పడిపోయారు. అందుకే యంగ్ యాక్టర్స్ తో పాటు సీనియర్ యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు ప్రేక్షకులకు ఓటీటీల ద్వారా దగ్గరయ్యారు కూడా.. దీంతో.. ఇప్పుడు చిరు కూడా ఓటీటీ బాట పట్టాలని ఫిక్సయ్యారట.. అనుకున్నదే తడవుగా తన ఫస్ట్ వెబ్ సిరీస్ కి చిరు సైన్ చేశారంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. .
ఇక.. చిరు ఓటీటీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ రీజన్‌తోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ ఒప్పందం కుదురుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ గతంలో చెప్పినట్టుగానే మంచి స్క్రిప్ట్ దొరకడంతో ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న చిరు మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి ఇంప్రెషన్ చూపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.. అయితే అది ఎలాంటి సిరీస్, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నారనే విషయాలపై ఇంకా క్లారిటీ రానప్పటికీ.. చిరు ఓటీటీ ఎంట్రీ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది