రామ్ చరణ్ చిరుత సినిమాతో మెహర్ రమేష్ లింక్.. వామ్మో బ్యాగ్రౌండ్ లో ఇంత జరిగిందా..?
మనం ఎన్ని అంతస్తులు కట్టాలి అనుకున్నా కూడా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అది లేకపోతే బిల్డింగ్ నిలబడదు. రామ్ చరణ్ కెరీర్ కు అలాంటి స్ట్రాంగ్ బేస్మెంట్ వేసిన సినిమా చిరుత.

మనం ఎన్ని అంతస్తులు కట్టాలి అనుకున్నా కూడా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అది లేకపోతే బిల్డింగ్ నిలబడదు. రామ్ చరణ్ కెరీర్ కు అలాంటి స్ట్రాంగ్ బేస్మెంట్ వేసిన సినిమా చిరుత. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి కమర్షియల్ సక్సెస్ అయింది. ఆ రోజుల్లో 9 కోట్లతో అశ్విని దత్ నిర్మించిన చిరుత సినిమా దాదాపు 23 కోట్ల షేర్ వసూలు చేసి.. అప్పట్లో ఒక డెబ్యు హీరోకు కావాల్సిన విజయాన్ని అందించింది చిరుత. ఆ తర్వాత మగధీర సినిమా చూసి స్టార్ హీరో అయ్యాడు చరణ్. అందుకే పూరి అంటే ఇప్పటికీ రామ్ చరణ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చిరుత సినిమా వెనకాల అసలైన కథ ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ సినిమా స్టోరీ రాసింది పూరి జగన్నాథ్ కాదు మెహర్ రమేష్ అని ఎంతమందికి తెలుసు..? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ నిజంగానే చిరుత సినిమా కథ రాసింది మెహర్ రమేష్ గాని తాజాగా బయటికి వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాంశంకర్ కోసం మెహర్ రాశాడు.
2004 డిసెంబర్లో షూటింగ్ కూడా మొదలైంది. 2002లో హాలీవుడ్ లో వచ్చిన Swept Away అనే సినిమా నుంచి స్ఫూర్తి పొంది సాయిరాం శంకర్ కోసం ఈ కథ రాసాడు మెహర్ రమేష్. దీనికి సాగర్ అనే టైటిల్ కూడా పెట్టాడు. షూటింగ్ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత బ్యాంకాక్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో అక్కడ సునామీ రావడంతో షెడ్యూల్ తో పాటు షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఆ స్టోరీని పూర్తిగా తీసి పక్కన పెట్టేసాడు మెహర్ రమేష్. అదే సమయంలో తమ్ముడిని హీరోగా పెట్టి 143 సినిమా తీశాడు పూరి జగన్నాథ్. ఇక దాని గురించి అందరూ మర్చిపోయారు. మళ్లీ మూడేళ్ల తర్వాత రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేయాలి ఏదైనా కథ ఉంటే సిద్ధం చేయి అని చిరంజీవి.. పూరి జగన్నాథ్ ను అడగడంతో.. మెహర్ రమేష్ రాసిన ఆ కథను తీసుకొచ్చి చిరుతగా తీశాడు పూరి.
సాయిరాం శంకర్ కోసం రాసిన సాగర్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. దాన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ కథగా మార్చేశాడు పూరి జగన్నాథ్. పూర్తిగా రొమాంటిక్ కోణంలో సాగే సాగర్ కథలోకి పర్సనల్ రివెంజ్ అని కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్. అది మినహాయిస్తే మిగిలిన కథ మొత్తం మెహర్ రమేష్ రాసిన స్క్రిప్ట్ వాడుకున్నాడు. అందులో క్యారెక్టర్ నేమ్స్ కూడా మెహర్ రమేష్ పెట్టినవే. ఈ విషయాలన్నీ తాజాగా రైటర్ తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పట్లో సాగర్ సినిమా కథ కోసం తాను కూడా మెహర్ రమేష్ తో కలిసి కూర్చున్నాను అని చెప్పాడాయన. ఆయన రాసిన కథనే కొన్ని మార్పులు చేసి చిరుత సినిమాగా పూరి జగన్నాథ్ తీశాడు అని క్లారిటీ ఇచ్చాడు. ఈ లెక్కన కాలం కలిసి వచ్చి ఉంటే 2005 లోనే మెహర్ రమేష్ దర్శకుడిగా మారేవాడు.
కానీ అప్పుడు కుదరకపోవడంతో మరో మూడు నాలుగు సంవత్సరాలు పూరి జగన్నాథ్ దగ్గరే పని చేసి.. 2009లో కంత్రి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఆ తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ లాంటి సినిమాలు తీశాడు ఈయన. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా విజయం సాధించకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ డిజాస్టర్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు మెహర్. కానీ అదే పూరి జగన్నాథ్ రాసిన కథలతో కన్నడలో దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా అజయ్, వీర కన్నడిగా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మ్యాటర్ ఏదైనా రామ్ చరణ్ ఖరీదు గట్టి పునాది వేసిన చిరుత సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాసింది పూరి జగన్నాథ్ కాదు అని తెలిసి ఇప్పుడు షాక్ అవుతున్నారు అభిమానులు.