Anand Devarakonda: బేబీలో ఉన్నదేంటి..? దేవదాస్ బుడ్డీ పగిలితే డబ్బే డబ్బు
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన బేబీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అన్నకు అర్జున్ రెడ్డి ఎలానో, ఆనంద్ కి బేబీ అలా అనేంతగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతా ఇది ఆర్ ఎక్స్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ వర్షన్ అనేస్తున్నారు.

Baby Movie is Better Verstion To RX100 Movie
ఐతే ఇక్కడ ఆర్ ఎక్స్ హండ్రెడ్, బేబీ, అర్జున్ రెడ్డి అన్నీంటికీ దేవదాసుతోనేపోలికలున్నాయి. అన్నీంట్లో హీరో మంచివాడు.. హీరోయిన్ ని ప్రాణంగా ప్రేమిస్తాడు.. కాని హీరోయినే తనకి హ్యాండ్ ఇస్తుంది.. తర్వాత తాగుడికి బానిసై హీరో రోడ్డున పడతాడు.
అర్జున్ రెడ్డిలో లో హీరో డాక్టర్, బేబీలో హీరో ఆటోడ్రైవర్.. అదే వ్యత్యాత్సం మిగతాదంతా సేమ్ టూ సేమ్. కాకపోతే, అర్జున్ రెడ్డిలో హీరోకి హీరోయిన్ దూరంగా ఉంటుంది.. తండ్రి వల్ల మరో పెళ్లి చేసుకుంటుంది.. కాని బేబీలో లవ్ స్టోరీ ట్రాయాంగిల్ గా ఉంటుంది. ఓరకంగా చెప్పాలంటే ఆర్ ఎక్స్ హండ్రెడ్ కి ఇంకాస్త బెటర్ వర్షన్ గానే ఉంది. అప్పట్లో వచ్చిన దేవదాస్ కథలోంచే అర్జున్ రెడ్డి నుంచి బేబీ వరకు అంతా పుట్టారనే మాటే వినిపిస్తోంది. అప్పట్లో దేవదాస్ పారూ కోసం తాగి క్వాటర్ బాటిల్ పగలకొడితే కోట్ల వసూళ్లొచ్చాయి. ఇక్కడ బేబీ కోసం ఆటో డ్రైవర్ తన క్వాటర్ ని పగలకొట్టేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. హీరో మనసు ప్రేమలో గాయపడ్డ కాన్సెప్ట్ ప్రస్తుతం యూత్ కి బాగా ఎక్కేస్తోంది. అది కూడా వాటర్ కలపని క్వాటర్ లా అంటున్నారు సోషల్ మీడియాలో మీమ్స్ తో నెటీజన్స్.